KCR cabinet: మంత్రుల మధ్య బోర్డర్ పంచాయితీ.. సీఎంకు కొత్త తలనొప్పి

గులాబీ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యే ల మధ్య విబేధాలు పెరుగుతున్నాయా? జిల్లాలో మంత్రుల మధ్య గెట్టు పంచాయతీ మొదలైందా? పరిస్థితిని చూస్తుంటే నిజమేనంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. ఇందుకు పలు జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలను ఎత్తిచూపుతున్నాయి.

KCR cabinet: మంత్రుల మధ్య బోర్డర్ పంచాయితీ.. సీఎంకు కొత్త తలనొప్పి
Follow us

|

Updated on: Mar 05, 2020 | 11:00 AM

Internal war between ministers worrying CM KCR: గులాబీ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యే ల మధ్య విబేధాలు పెరుగుతున్నాయా? జిల్లాలో మంత్రుల మధ్య గెట్టు పంచాయతీ మొదలైందా? సీనియర్ నేతలకు మంత్రులకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోందా? అసలు జిల్లాల్లో గులాబీ నేతల మధ్య విభేదాలకు కారణమేంటి?

టీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకు నేతల మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి చేరి కొందరు మంత్రి పదవులను దక్కించుకుంటే….. మరికొందరు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను దక్కించుకున్నారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. మొదట్లో బాగానే ఉన్నా రాను రాను జిల్లాల్లో మంత్రులకు..మంత్రులకు మధ్య విభేదాలే కాదు. మంత్రులకు, పార్టీ సీనియర్ నేతలకు ఆధిపత్య పోరు మొదలైందట.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేబినెట్‌లో ఎమ్మెల్యే దయాకర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని టాక్. జిల్లాలో అన్ని తానే అనుకుంటున్న దయాకర్ రావు ఉమ్మడి జిల్లా మొత్తం తిరుగుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలోనూ ఎర్రబెల్లి దయాకర్ రావు తన ప్రభావాన్ని చాటుకోవడం సత్యవతి రాథోడ్‌కు ఇబ్బందిగా మారిందట. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. దీంతో మహబూబాబాద్, ములుగు జిల్లాలను సత్యవతి రాథోడ్ చూసుకుంటారని…ఇద్దరి మంత్రుల మధ్య సరిహద్దులు గీశారట ముఖ్యమంత్రి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ దాదాపుగా ఇదే సమస్య మంత్రులకు ఎదురవుతోందట. ఈ జిల్లా నుంచి చి నలుగురు మంత్రులు క్యాబినెట్‌లో ఉన్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను పక్కనపెడితే మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇక మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌ల మధ్య కూడా వారి వారి నియోజక వర్గాల్లోనే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మంత్రిగా చక్రం తిప్పుదామనుకున్నా ఆ పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో ఈ ఇద్దరు మంత్రులు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండటం ఆ జిల్లా ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగింది. ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు గ్రూప్‌ కట్టినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోను మంత్రి పువ్వాడ అజయ్‌కు మిగతా నేతలకు మధ్య ఉప్పు నిప్పు గానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పువ్వాడ వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మధ్య కోల్డ్‌ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పట్టు కోసం ఇద్దరు ప్రయత్నాలు చేస్తుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారట. రంగారెడ్డి జిల్లాలోని దాదాపుగా ఇదే సమస్య. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి దక్కింది. మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి జిల్లాలో ఇబ్బందికరంగా మారింది.

ఇదీ చదవండి: కరోనాపై చేతులెత్తేసిన గాంధీ డాక్టర్లు! Gandhi hospital doctors hands-up on Covid-19 tests

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..