AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ‘లూసిఫర్’ రీమేక్.. చిరు మనసులో ఆ యంగ్ డైరక్టర్..!

దర్శకుడి ఎంపిక విషయంలో మెగాస్టార్ లెక్కలు వేరు. దర్శకుడిపై నమ్మకం ఉంటే చాలు హిట్లు, ఫ్లాప్‌లు పట్టించుకోకుండా వారికి అవకాశం ఇస్తుంటారు చిరంజీవి. ఇక ఈ విషయంలో ఆయన జడ్జిమెంట్ పలుమార్లు కరెక్ట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ యంగ్ దర్శకుడిపై చిరు కన్నేశారట. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న చిరు.. ఆ తరువాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రీమేక్ హక్కులను రామ్ చరణ్ ఎప్పుడో తీసుకున్నారు. […]

Chiranjeevi: 'లూసిఫర్' రీమేక్.. చిరు మనసులో ఆ యంగ్ డైరక్టర్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 05, 2020 | 2:07 PM

Share

దర్శకుడి ఎంపిక విషయంలో మెగాస్టార్ లెక్కలు వేరు. దర్శకుడిపై నమ్మకం ఉంటే చాలు హిట్లు, ఫ్లాప్‌లు పట్టించుకోకుండా వారికి అవకాశం ఇస్తుంటారు చిరంజీవి. ఇక ఈ విషయంలో ఆయన జడ్జిమెంట్ పలుమార్లు కరెక్ట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ యంగ్ దర్శకుడిపై చిరు కన్నేశారట. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న చిరు.. ఆ తరువాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రీమేక్ హక్కులను రామ్ చరణ్ ఎప్పుడో తీసుకున్నారు.

ఇక ఈ రీమేక్‌కు సంబంధించి పలువురి దర్శకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. సుకుమార్, పరశురామ్, కొరటాల శివ, హరీశ్ శంకర్, వివి వినాయక్ ఇలా పలువురు పేర్లు లూసిఫర్ రీమేక్ లిస్ట్‌లో వినిపించాయి. ఇక ఇటీవల వివి వినాయక్ ఫిక్స్ అయినట్లు కూడా టాక్ నడిచింది. అయితే ఈ రీమేక్ బాధ్యతలను చిరు ఓ యంగ్ హీరోకు ఇవ్వాలనుకుంటున్నారట. రన్‌ రాజా రన్‌తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుజీత్.. రెండో సినిమాగా ప్రభాస్‌తో సాహోను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. దర్శకుడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ఓ యాక్షన్ సినిమాను టాలీవుడ్‌లో ఇంతవరకు ఏ దర్శకుడు తెరకెక్కించంత స్టైలిష్‌గా సుజీత్ తెరకెక్కించారంటూ కొంతమంది విమర్శకులు కూడా ప్రశంసలు వినిపించారు. ఇక ఈ సినిమాను చూసిన చిరుకు కూడా సుజీత్ టేకింగ్ బాగా నచ్చిందట. అందుకే లూసిఫర్ రీమేక్‌కు సుజీత్ కరెక్ట్‌గా సరిపోతారని చిరు భావిస్తున్నారట. ఎమోషనల్ సన్నివేశాలను సుజీత్ బాగా హ్యాండిల్ చేయగలడన్న నమ్మకాన్ని చిరు, చరణ్ ముందు ఉంచారట. దీంతో చరణ్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రీమేక్‌కు సుజీత్ ఫైనల్ అయితే.. అతడికి బంపరాఫర్ దక్కినట్లే. ఇదిలా ఉంటే ఇటీవల చెర్రీ కోసం ఓ కథను రెడీ చేసుకున్న సుజీత్.. అతడికి వినిపించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. Read This Story Also: రజనీకి విలన్‌గా టాలీవుడ్ ఫేమస్ హీరో.. ఇదే నిజమైతే..!

Follow Us
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..