AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా పంజా విసిరింది.

దేశంలో కరోనా పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుర్‌గావ్‌లోని ఓ పేటిఎం ఉద్యోగికి వైరస్‌ సోకింది. ఇటీవలే ఇటలీకి వెళ్లొచ్చిన అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29కి చేరింది. నిన్న కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి దేశవ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వారిలో ఇటాలియన్లు 16 మంది, ఒక ఇండియన్‌ డ్రైవర్‌, ఢిల్లీలో ఒకరు, ఆగ్రాలో 6, తెలంగాణ ఒకరు, […]

Pardhasaradhi Peri
|

Updated on: Mar 05, 2020 | 10:30 AM

Share

దేశంలో కరోనా పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుర్‌గావ్‌లోని ఓ పేటిఎం ఉద్యోగికి వైరస్‌ సోకింది. ఇటీవలే ఇటలీకి వెళ్లొచ్చిన అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29కి చేరింది. నిన్న కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి దేశవ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వారిలో ఇటాలియన్లు 16 మంది, ఒక ఇండియన్‌ డ్రైవర్‌, ఢిల్లీలో ఒకరు, ఆగ్రాలో 6, తెలంగాణ ఒకరు, కేరళలో 3, తాజాగా గుర్‌గావ్‌లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది.

కరోనా వ్యాప్తితో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం..అన్ని మార్గాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుర్‌గావ్‌ ఉద్యోగికి కరోనా సోకడంతో..పేటీఎం సంస్థ తమ ఉద్యోగులకు కొద్ది రోజుల పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు కల్పించింది. ఇటు ఇండియన్‌ రైల్వే కూడా కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రతి డివిజనల్‌, సబ్‌ డివిజన్‌ ఆస్పత్రుల్లో స్పెషల్‌ వార్డులు ఏర్పాటుచేయాలని ఆరోగ్యశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పాఠశాల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కరోనాపై విద్యార్థులకు అవగాహన పెంచాలని సూచించారు. ఇక ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్‌లు ఉపయోగించేందుకు సీబీఎస్‌ఈ అనుమతిచ్చింది

వుహాన్‌, ఇటలీ లాంటి కరోనా వైరస్‌ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 14 రోజుల పాటు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలు కూడా ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర