మీ మొబైల్ ఫోన్ల‏లో పర్సనల్ డేటాను సేవ్ చేసుకుంటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..

సాధరణంగా మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను మన ఫోన్లలో సేవ్ చేసుకుంటుంటాం. అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ల నుంచి పిన్ నంబర్ల వరకు..

మీ మొబైల్ ఫోన్ల‏లో పర్సనల్ డేటాను సేవ్ చేసుకుంటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 5:30 PM

సాధరణంగా మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను మన ఫోన్లలో సేవ్ చేసుకుంటుంటాం. అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ల నుంచి పిన్ నంబర్ల వరకు.. అలాగే జీమెయిల్, ఫేస్‏బుక్ వంటి వాటి పాస్వర్డ్‏లు, పర్సనల్ ఫోటోలను కూడా ఫోన్లలోనే సేవ్ చేసుకుంటుంటాం. వీటి కోసం ప్లే స్టోర్ నుంచి నోట్ పాడ్స్, అలాగే వర్డ్ పాడ్ అంటూ ఏవేవో యాప్‏లను డౌన్‏లోడ్ చేస్తుంటాం. అయితే ఇలా వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్స్‏లో సేవ్ చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. వీటివల్ల సైబర్ నేరగాళ్లు మీ పర్సనల్ డేటాను తీసుకునే అవకాశం ఉందని సూచిస్తు్న్నారు. అయితే ఫోన్లలో సేవ్ చేసుకునే పర్సనల్ డేటాను ఎలా భద్రపరుచుకోవాలో తెలుసుకుందాం.

ప్రస్తుతం అందరి జీవన ప్రయాణంలో మొబైల్ ఫోన్ సర్వసాధరణమైంది. దాంతోపాటే ఫోన్‏కు ప్రతిఒక్కరు పాస్‏వర్డ్ పెట్టుకుంటుంటారు. అయితే ఫోన్‏కు స్ట్రాంగ్ పాస్‏వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఒకే పాస్‏వర్డ్ ఎక్కువ సార్లు వాడకపోవడం మంచిది. ఇక వివిధ యాప్‏లలో స్టోర్ చేసే డేటా మొత్తం మెయిల్ అకౌంట్ ద్వారా క్లౌ్డ్ స్టోర్‏లో స్టోర్ అవుతుంది. అన్ని పాస్‏వర్డులను ఆటోఫిల్ ద్వారా స్టోర్ చేయడానికి బదులుగా పాస్‏వర్డ్ మేనేజర్ వాడొచ్చు. అలాగే డాష్ లైన్ లేదా లాస్ట్ పాస్ అనే సెక్యూర్ వంటివి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక స్ట్రాంగ్ పాస్‏వర్డ్ పెట్టుకొని అన్ని పాస్‏వర్డులకు ఒకేసారి యాక్సెస్ చేయవచ్చు. ఇక ఫింగర్ ఫ్రింట్ పాస్‏వర్డ్ అసలు సెక్యూర్ కాదు. ఎందుకంటే మీకు తెలియకుండానే ఫింగర్ ప్రింట్ ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా న్యూమరిక్ పాస్‏వర్డ్ పెట్టుకోవడం మంచిది.

వీటితోపాటు ఫేస్ లాక్ కూడా సరైనది కాదు. ఎందుకంటే కొన్ని సార్లు మీ ఫేస్ రిక్నగైనేషన్ కాదు. దీంతో ఫోన్ అన్ లాక్ అయ్యే అవకాశం ఉండదు. ఈ ఫేస్ లాక్‏కు బదులుగా పాట్రన్ పాస్‏వర్డ్, న్యూమరిక్ పాస్‏వర్డులు పెట్టుకోవడం మంచిది. ఇక అలాగే మీ ఫోన్లో పర్సనల్ ఫోటోలను సేవ్ చేయకపోవడం ఉత్తమం. మీ పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్‏లలో సేవ్ చేసుకోవడం మంచిది. ఇక వీటికి పాస్‏వర్డ్ ఉపయోగించి యాక్సెస్ చేసుకునేలా చూసుకోండి. మీ మొబైల్స్‏లో వ్యక్తిగత సమాచారంతోపాటు ఫోటోలను కలిసి స్టోర్ చేయకండి. ఫోన్లో సేవ్ చేసిన ప్రతిడేటా అకౌంట్ ద్వారా క్లౌడ్ స్టోరేజీలోకి వెళ్ళిపోతుంది. ఇక క్లౌడ్ డేటా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో హ్యకర్ల చేతికి మీ పర్సనల్ డేటాతోపాటు.. ఫోటోలు కూడా వెళ్ళిపోతాయి. ఉద్యోగం చేసేవారు ఆఫీసు ఇచ్చిన ఫోన్లలో తమ పర్సనల్ డేటాను స్టోర్ చేయకూడదు. ఎందుకంటే మీ ఆఫీస్ ఫోన్‏ను మీ సహ ఉద్యోగులు యాక్సెస్ చేస్తే.. మీ డేటా మొత్తం వారికి చేరుతుంది. దాదాపు ఆఫీస్ ఫోన్‏ను వ్యక్తిగత అవసరాలకు వాడకపోవడంమే బెటర్.

వీటితోపాటు సాధరణంగా చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్ నంబర్లు, పాస్‏వర్డులను ఫోన్లలో సేవ్ చేస్తుంటారు. ఇలా చేయడం చాలా రిస్క్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్నిసార్లు మీ ఫోన్ పోయినా.. హ్యాకర్ల చేతిలో పడినా మీ బ్యాంక్ వివరాలు మొత్తం తెలిసిపోతాయి. దీంతో ఆర్థికంగా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. ఫోన్‏కు బదులుగా మీ ఇంట్లో ఉండే కంప్యూటర్ లేదా మీ పర్సనల్ ల్యాప్ టాప్‏లో సేవ్ చేసుకోవడం ఉత్తమం. ఇక ఆ సమాచారాన్ని మొత్తం యాక్సెస్ చేయడానికి ఒక యూనిక్ పాస్‏వర్డ్ సెట్ చేసుకోండి. దాదాపు కొంత మంది తమ ఇంటి అడ్రస్, సన్నిహితులు ఇంటి అడ్రస్ సేవ్ చేసుకుంటుంటారు. అలా చేయడం కూడా కొన్ని సార్లు రిస్క్. ఎందుకంటే మీ ఫోన్ పోయిన, లేదా సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేసినా.. మీ ఇంటి అడ్రస్ వివరాలు తెలియడంతో మీ పరిచయస్తుల్లాగా వచ్చి చోరీలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పర్సనల్ అకౌంట్లను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.

Also Read:

Business News: మీరు ఇన్‏కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? అయితే మీ ఐటీఆర్‏కు ఆధార్ నంబర్‏ను లింక్ చేయండిలా..

కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే.. ప్రయాణికుల కోసం రెడీ-టు-ఈట్-మీల్స్.. సన్నాహాలు చేస్తున్న ఐఆర్‏సీటీసీ..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..