AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Easy Tiffin Recipes: వర్కింగ్ ఉమెన్ కోసం ఈజీగా కుకింగ్.. క్షణాల్లో ఆరోగ్యకరమైన వంటకాలు

ప్రస్తుత కాలంలో మహిళలు కూడా మగవారితో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆడవారికి ఇల్లాలుగా ఇంటి బాధ్యతలతో పాటు.. ఉద్యోగిగా తన విధి నిర్వహణ

Easy Tiffin Recipes: వర్కింగ్ ఉమెన్ కోసం ఈజీగా కుకింగ్.. క్షణాల్లో ఆరోగ్యకరమైన వంటకాలు
Surya Kala
|

Updated on: Jan 22, 2021 | 5:38 PM

Share

Easy Tiffin Recipes: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా మగవారితో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆడవారికి ఇల్లాలుగా ఇంటి బాధ్యతలతో పాటు.. ఉద్యోగిగా తన విధి నిర్వహణ కూడా చూసుకోవాల్సి వస్తుంది.. దీంతో పొద్దున్నే ఓ వైపు ఆఫీస్ కు రెడీ అవుతూ.. మరోవైపు వంట చేసుకోవాల్సి ఉంది. దీంతో టిఫిన్ ను చెయ్యడానికి ఎక్కువ సమయం కేటాయించే తీరుబడి ఆఫీస్ వర్కింగ్ డేస్ లో కుదరదు. ఇక స్కూల్ కు వెళ్ళే పిల్లలు ఉంటే మరింత పని అదనంగా ఉంటుంది.. దీంతో ఆఫీసులకు వెళ్ళే మహిళలు త్వరగా.. ఈజీగా రెడీ చేసుకునే .. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ ల తయారీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు.. మరి అలా ఈజీగా చేసుకొనే ఆరోగ్యకరమైన కొన్ని అల్పాహారాల తయారీ మీకోసం …

*హోల్ వీట్ బ్రెడ్ టోస్ట్

హోల్ వీట్ బ్రెడ్ ని టోస్ట్ చేసి దానిపై పీనట్ బట్టర్ ని అప్లై చేయాలి.. అనంతరం దానిపై బాగా పండిన అరటిపండు ముక్కలను పెట్టి తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం…

* బెర్రీస్ అండ్ యోగర్ట్ (పెరుగు) స్మూతి:

ఒక కప్పు పెరుగులో కొన్ని ఫ్రెష్ లేదా ఫ్రోజెన్ బెర్రీస్ ను కలిపి బ్లెండ్ చెయ్యాలి.. ఇలా స్మూతి అయ్యే వరకూ బ్లెండ్ చేసి తాగితే.. ఎనర్జీ రావడం ఖాయం….

* పీనట్ బట్టర్ అండ్ బనానా స్మూతి :

ఒక గ్లాసులో పాలు తీసుకొని రెండు స్పూన్స్ పీనట్ బట్టర్ తో పాటు ఒకటి బాగా పండిన అరటి పండును బ్లెండర్ లో వెయ్యాలి.. స్మూతి అయ్యే వరకూ బ్లెండ్ చేసి.. అల్పాహారంగా తీసుకొంటే.. రోజంతా శక్తివంతంగా ఉంటారు..

*క్వినోవా ఫ్రూట్ సలాడ్ :

క్వినోవాని ఒక కప్పు తీసుకొని మెత్తగా ఉడికించాలి. అనతరం ఒక కప్పులో ఆ పేస్ట్ ని తీసుకొని దానిపై బెర్రీస్, చెర్రీస్, ఆపిల్ వంటి ఫ్రెష్ ఫ్రూట్స్ టాపింగ్ గా వేసుకొని ఆరగిస్తే.. రుచికరంగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

* ఓట్ మీల్స్ .. ఎగ్:

ఒక కప్ రా ఓట్స్ ని నీటిలో వేసి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి.. అనంతరం ఈ ఓట్స్ పై ఫ్రెష్ ఫ్రూట్స్ టాపింగ్ చేసుకొని తినవచ్చు.. అంతేకాదు.. కోడి గుడ్డు ఇష్టమైన వాళ్ళు.. ఓట్స్ పేస్ట్ పై ఆమ్లెట్ ని కూడా టాపింగ్ కి వాడవచ్చు.. ఓట్స్ కి ఏ ఫ్రూట్ టాపింగ్ అయినా టేస్టీగా ఉంటుంది..

Also Read: అమ్మ చేతిలో గారాల తనయుడు బిగ్ బాస్ సీజన్ 4 విజేత.. అభిజిత్ చిన్ననాటి ఫోటో