నిమ్స్‌లో అమానుష ఘటన.. చెత్తకుండీలో..!
నిత్యం వేలాది మందికి వైద్యాన్ని అందిస్తున్న హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో ఆవరణలో ఓ అమానవీయ ఘటన జరిగింది. అక్కడే ఉన్న ఓ చెత్త కుప్పలో అప్పుడే జన్మించిన పసికందు లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో చుట్టి వదిలి పసిపాపను వదిలి వెళ్లిపోయారు. చెత్త కుండీలో నుంచి ఆ పాప ఏడుపులు వినిపిస్తుండటంతో అటుగా వెళ్తున్న కొంతమంది పాపను రక్షించారు. వెంటనే నిమ్స్ హాస్పిటల్‌లో వైద్యులకు ఫిర్యాదు చేసి వైద్య పరీక్షలు చేయించారు. అయితే […]
నిత్యం వేలాది మందికి వైద్యాన్ని అందిస్తున్న హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో ఆవరణలో ఓ అమానవీయ ఘటన జరిగింది. అక్కడే ఉన్న ఓ చెత్త కుప్పలో అప్పుడే జన్మించిన పసికందు లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో చుట్టి వదిలి పసిపాపను వదిలి వెళ్లిపోయారు. చెత్త కుండీలో నుంచి ఆ పాప ఏడుపులు వినిపిస్తుండటంతో అటుగా వెళ్తున్న కొంతమంది పాపను రక్షించారు. వెంటనే నిమ్స్ హాస్పిటల్‌లో వైద్యులకు ఫిర్యాదు చేసి వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఈ చిన్నారి.. ఆడ శిశువు కావడంతోనే ఇలా వదిలి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు ఈ దుర్మార్గానికి పాల్పడింది ఎవరై ఉంటారనే దానిపై హాస్పిటల్‌లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.