Indo-china Talks: భారత-చైనా దేశాల మధ్య నేడు పదో దఫా చర్చలు, ఇక ఖాళీ కానున్న గాల్వన్ లోయ.

భారత-చైనా దేశాల మధ్య శనివారం పదో దఫా చర్చలు జరగనున్నాయి. గాల్వన్ లోయలో ఉపసంహరణకు సంబంధించి ఈ చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. లడాఖ్ లో..

Indo-china  Talks: భారత-చైనా  దేశాల మధ్య నేడు పదో దఫా చర్చలు, ఇక ఖాళీ కానున్న గాల్వన్ లోయ.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 20, 2021 | 10:30 AM

Indo-china Talks:  భారత-చైనా దేశాల మధ్య శనివారం పదో దఫా చర్చలు జరగనున్నాయి. గాల్వన్ లోయలో ఉపసంహరణకు సంబంధించి ఈ చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద సేనలు, ట్యాంక్ లు, తదితరాల ఉపసంహరణ ఈ నెల 10 నుంచి ప్రారంభమయింది.  లడాఖ్ లోని తూర్పు ప్రాంతంలో మోల్డో బోర్డర్ వద్ద కోర్స్ కమాండర్ స్థాయిలో ఈ తాజా చర్చలు జరుగుతాయని సమాచారం. నియంత్రణ రేఖ వద్ద అన్ని కీలక ప్రాంతాల్లో ఉపసంహరణలపై గత ఏడాది జూన్ 6 న చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 15 న గాల్వన్ లోయలో చైనీయులతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అటు చైనా వైపున 40 మంది సైనికులు మృతి చెందినట్టు ఆ మధ్య ఆ దేశం ప్రకటించింది.

ఫింగర్-8 ప్రాంతంలో చైనా దళాల ఉపసంహరణ జరుగుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 11 న రాజ్యసభలో ప్రకటించారు. అయితే భారత ఆర్మీ.. ఫింగర్-3 ప్రాంతంలోని తమశాశ్వత స్థావరం వద్ద మోహరించి ఉంటుందన్నారు. అటు-ఉభయ దేశాల మధ్య నేడు జరగనున్న చర్చల ఫలితంపై భారత ప్రభుత్వంతో బాటు వివిధ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Read More:

Job Mela In Hyderbad: నేడు హైదరాబాద్‌లో జాబ్‌ మేళా.. 15కు పైగా కంపెనీలు.. 2000ల ఖాళీలు..

Village Name Changed: ఊరి పేరు మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన.. సంతోషంలో నేతలు, పార్టీ శ్రేణులు..