AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు!

ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నాడు.. అందరూ అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రవి తమ్తా అనే కుర్రాడు. తమ గ్రామంలో జనాలు ఎదుర్కొనే రోజువారీ సమస్యకు పరిష్కారం చూపేందుకు సరికొత్తగా గాల్లో ఎగిరే డ్రోన్ కార్‌ను కనిపెట్టాడు. దాన్ని విజయవంతంగా పరీక్షించి సక్సెస్ అయ్యాడు.

Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు!
Uttarakhand Youth Builds Flying Drone Car
Anand T
|

Updated on: Aug 08, 2026 | 3:26 PM

Share

అవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం.. నిజ జీవితంలో జరగడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ అతను మాత్రం.. అది ఎందుకు సాధ్యం కాదు అని ఆలోచించాడు. ప్రయత్నించాడు.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుతం సృష్టించాడు. అతనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరాలోని కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తా. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు రవి.. ‘హ్యాపిడా స్కైనెక్స్’ అనే సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ తయారు చేసి.. విజయవంతంగా పరీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

తమ గ్రామంలో జనాలు ఎదుర్కొంటున్న సమస్య నుండే ఈ వినూత్న ఆలోచన పుట్టిందని తమ్తా తెలిపాడు. రవి నివసించేది ఓ కొండ ప్రాంతం.. అతను గ్రామం నుంచి ఇంటికి చేరుకోవడానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఈ దూరాన్ని దాటడానికి అతనికి సుమారు 90 నిమిషాల సమయం పడుతుంది. అదే ఒకవేళ వాయు మార్గంలో అయితే జస్ట్ 10 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తమ్తా గ్రహించాడు. దాంతో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని రూపొందించేందుకు చాలా రోజులు కష్టపడ్డాడు. చివరకు దాన్ని తయారు చేసి విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ చేశాడు.

రవి ఏర్పాటు చేసిన స్టార్టప్ ‘హపిదా స్కై ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని నిర్మించారు. ఒక వ్యక్తిని గాలిలో సురక్షితంగా తీసుకువెళ్లేందుకు వీలుగా, డ్రోన్ టెక్నాలజీని సవరించి, అప్‌గ్రేడ్ చేసి దీనిని తయారు చేశాడు. లైఫ్‌లోనే ఇది తనకో బిగ్ అచీవ్‌మెంట్ అని రవి చెప్పుకొచ్చాడు. కొన్ని సంవత్సరాలు తాను పడ్డ కష్టానికి దక్కిన ఫలితమే ఈ విజయం అని చెప్పాడు. ఈ క్షణంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు రవి తెలిపాడు.

అయితే ఈ ‘హపిడా స్కైనెక్స్’ ప్రస్తుతం నమూనా (ప్రోటోటైప్) దశలోనే ఉందని.. ఇది ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని రవి అన్నాడు. అయినప్పటికీ ఈ టెస్ట్ డ్రైవ్ అనేది ఈ విజయానికి తొలి మెట్టు వంటిదని తెలిపాడు. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే.. కొండ ప్రాంతాల్లో, రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లోని ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. అలాగే నగరాల్లో వీటి వినియోగం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us