Bank Holidays: మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఈ రోజుల్లోనే.. ముందుగానే ప్లాన్ చేస్కోండి..
బ్యాంక్ సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాలి. బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయి.. ఏ రోజున తెరిచి ఉంటాయి అనేది గమనించాలి. ఆర్ధిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఇది అవసరం. అయితే వచ్చే వారంలో మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వాటి వివరాలు ఇలా..

ఆగస్ట్ రెండో వారం వచ్చేస్తోంది. దీంతో బ్యాంక్ సెలవులు మారనున్నాయి. బ్యాంకులు ఏయే రోజుల్లో మూసివేసి ఉంటాయనేది ప్రతీ ఒక్క ఖాతాదారుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నా లేదా చెక్కులు డిపాజిట్ చేయాలని అనుకుంటున్నా, రుణం కోసం బ్యాంకును సందర్శించాలనుకుంటున్నా సెలవుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు మూతపడతాయి. జాతీయ, రాష్ట్ర సెలవులు, స్థానిక పండుగలు, ఆదివారం, రెండు, నాలుగో శనివారం బ్యాంకులు మూతపడతాయి. ఆగస్ట్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వచ్చే వారంలో స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు ఇతర సాధారణ సెలవులు రానున్నాయి. వచ్చే వారం బ్యాంకు సెలవుల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మూడు రోజుల పాటు బంద్
ఆగస్ట్ 13న గురువారం పేట్రియాట్స్ డే సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులు ఉండవు. ఇక ఆగస్ట్ 15న శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఆగస్ట్ 16న ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు. దీంతో కేవలం 10, 11,12,14వ తేదీల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. దీంతో బ్యాంక్ బ్రాంచ్‌లను సంప్రదించాలనుకుంటే ఈ సెలవుల గురించి తెలుసుకుని ప్లాన్ చేసుకోండి. బ్రాంచ్‌ను సందర్శించాలనుప్పుడు ముందుగానే సెలవుల జాబితా పరిశీలించండి. దీని వల్ల మీరు అసౌకర్యానికి గురి కాకుండా ఉంటారు.
ఆన్‌లైన్ సేవలు అందుబాటులో..
అయితే బ్యాంకులు మూతపడినా నగదు లావాదేవీలు యథావిధిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించుకోవచ్చు. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ విధానాల ద్వారా ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసుకోవచ్చు. ఇక ఇతర ఆన్ లైన్ సేవలన్నీ పొందవచ్చు. కేవలం బ్రాంచ్ సంబంధిత కార్యకలాపాలు మాత్రమే సెలవు రోజుల్లో అందుబాటులో ఉండవు. చెక్కు డిపాజిట్, రుణ పత్రాల ప్రాసెసింగ్ వంటి సేవలు నిలిచిపోతాయి. మిగతా బ్యాంకింగ్ సేవలను ఆన్‌లైన్ ద్వారా సులువుగా చేసుకోవచ్చు. అయితే ఆగస్ట్ 8వ తేదీన రెండో శనివారం రావడంతో నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. ఆగస్ట్ 9న ఆదివారం రావడంతో బ్యాంకులు ఉండవు. తిరిగి ఆగస్ట్ 10న బ్యాంకులు తెరుచుకోనున్నాయి. కాగా ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ఆధారంగా బ్యాంక్ సెలవులు ఉంటాయి. ఆర్బీఐ మూడు వర్గాలుగా సెలవులను విభజించింది. జాతీయ సెలవులు, రాష్ట్రాల ప్రాంతీయ సెలవులు, సాధారణ సెలవులు అనే మూడు వర్గాలుగా విభజించింది. రాష్ట్రాల్లోని స్థానిక పండుగల ఆధారంగా స్థానిక సెలవులు ఉంటాయి. ఇక జాతీయ సెలవుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడాయి.
