AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీరు ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారా? కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త రైల్వే నిబంధనలు

Indian Railways: భారతీయ రైల్వే తన నిబంధనలలో భారీ మార్పులను తీసుకువస్తోంది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15, 2026 మధ్య దశలవారీగా అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల వల్ల ప్రయాణికులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా రీఫండ్ నియమాలు, చివరి నిమిషంలో ప్రయాణికులకు కల్పించే వెసులుబాట్లపై స్పష్టతనిచ్చింది..

Indian Railways: మీరు ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారా? కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త రైల్వే నిబంధనలు
Indian Railways
Subhash Goud
|

Updated on: Apr 10, 2026 | 4:54 PM

Share

Indian Railways: భారతీయ రైల్వే తన నిబంధనలలో భారీ మార్పులను తీసుకువస్తోంది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15, 2026 మధ్య దశలవారీగా అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల వల్ల ప్రయాణికులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా రీఫండ్ నియమాలు, చివరి నిమిషంలో ప్రయాణికులకు కల్పించే వెసులుబాట్లపై స్పష్టతనిచ్చింది.

భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అయితే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే విధంగా నిబంధనలలో మార్పులు తీసుకువస్తోంది. ఇప్పుడు టికెట్‌ కన్ఫర్మ్‌ అయిన తర్వాత చాలా మంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. అలాంటి సమయంలో వచ్చే రీఫండ్‌లో కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ రూల్స్‌ ఏప్రిల్‌ నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే మారిన నిబంధనలు ఇంకా చాలా మందికి తెలియదు. మరి రీఫండ్‌ విషయంలో ఎలాంటి నిబంధనలు మారాయో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?

ఇవి కూడా చదవండి

మార్చి 24న విడుదలైన తాజా సమాచారం ప్రకారం, భారతీయ రైల్వేలు కన్ఫర్మ్ టికెట్ల రద్దుపై కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాయి. ఈ నియమాలు 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులకు మరింత స్పష్టత ఇవ్వడం, చివరి నిమిషం మార్పులను సులభతరం చేయడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం.

రిఫండ్ నిబంధనల్లో కీలక మార్పు

ఈ కొత్త విధానంలో ప్రధాన మార్పు 8 గంటల కట్-ఆఫ్ టైమ్. అంటే, రైలు బయలుదేరే సమయానికి 8 గంటల కంటే తక్కువ సమయంలో టికెట్ రద్దు చేస్తే ఇకపై ఎలాంటి రిఫండ్ అందదని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Gas Cylinder: ఆవు పేడతో గ్యాస్ సిలిండర్.. 18కేజీల గ్యాస్‌ జస్ట్‌ రూ.500లకే..!

  • బయలుదేరే సమయానికి ముందు – రిఫండ్ వివరాలు:
  • 72 గంటల కంటే ముందుగా రద్దు చేస్తే – గరిష్ట రిఫండ్
  • 72 గంటల నుంచి 24 గంటల మధ్య – టికెట్ ధరలో 75% రిఫండ్
  • 24 గంటల నుంచి 8 గంటల మధ్య – టికెట్ ధరలో 50% రిఫండ్
  • 8 గంటల లోపు – రిఫండ్ లేదు
  • రైలు బయలుదేరిన తర్వాత – రిఫండ్ లేదు

చివరి నిమిషం సౌకర్యాలు:

  • ప్రయాణికుల సౌకర్యం కోసం కొన్ని కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
  • బోర్డింగ్ పాయింట్ మార్పు: రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు యాప్ ద్వారా మీ బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు.
  • క్లాస్ అప్‌గ్రేడ్: ప్రయాణికులు బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు తమ టికెట్ క్లాస్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
  • PRS కౌంటర్ టికెట్లు: ఇకపై మీరు టికెట్ తీసుకున్న స్టేషన్‌లోనే కాకుండా దేశంలోని ఏ స్టేషన్‌లోనైనా కౌంటర్ టికెట్ రద్దు చేయవచ్చు.
  • ఈ-టికెట్లు: ఈ-టికెట్ రద్దు చేసిన వెంటనే రిఫండ్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది. ఇకపై TDR ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఇది కూడా చదవండి: Pension: పెన్షనర్లకు శుభవార్త.. ఇక నెలవారీ పెన్షన్ రూ. 25,000 దాటవచ్చు..!

ఈ కొత్త రైల్వే నిబంధనలు ప్రయాణికులకు మరింత పారదర్శకత, సౌకర్యం కల్పించడానికి రూపొందించారు. ముఖ్యంగా చివరి నిమిషంలో చేసే మార్పులకు వీలు కల్పించడం, రిఫండ్ ప్రక్రియను సులభతరం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ప్రయాణానికి ముందు ఈ నియమాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చు.

Ticket Rules

Ticket Rulesఇది కూడా చదవండి: Electric Scooters: భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. తక్కువ ధరల్లో బెస్ట్‌ మైలేజీ..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!