AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!

నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!

Phani CH
|

Updated on: Apr 10, 2026 | 12:48 PM

Share

కొడగు అడవిలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఐటీ టెకీ శరణ్య దారి తప్పి నాలుగు రోజులు ఒంటరిగా గడిపింది. ఆహారం లేకుండా, కేవలం నీళ్లు తాగుతూ, వన్యప్రాణులకు భయపడుతూ ప్రాణాలు నిలుపుకుంది. స్థానికులు గుర్తించి రక్షించారు. ఆమె కథ ఆత్మవిశ్వాసానికి ప్రతీక కాగా, ఆమెపై కొందరు బీజేపీ నాయకులు 'నాటకం' అని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.

అడవిలో తప్పిపోయి నాలుగురోజులు తిండీ తిప్పలు లేకుండా ఒంటరిగా గడిపింది. అడవి మృగాలు సంచరించే చోట రాత్రి వేళ చిమ్మచీకట్లోనే భయంగా గడిపింది. మరోవైపు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది. కేరళ నుంచి కర్నాటక కొడగు ప్రాంతానికి ట్రెక్కింగ్‌కు వచ్చి దారి తప్పిందా యువతి. కేరళ యువతి శరణ్య ఓ ఐటీ కంపెనీలో టెకీగా పనిచేస్తోంది. 12 మంది బృందంతో కొడగు జిల్లాలోని ఎత్తైన తడియాండమోల్‌ కొండ పైకి ఎక్కి, కిందకు దిగుతుండగా దారి తప్పింది. మిగిలిన వారికంటె వేగంగా ముందుకు నడిచింది. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు, వారు ఒక బండరాయిపై కూర్చుని కనిపించారు. వస్తారులే అని ముందుకు నడిచింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి, వారు ఎక్కడా కనిపించలేదు. పిట్‌స్టాప్‌కు చేరుకుని ఇతర ట్రెక్కర్ల కోసం వెతికింది. అలా శరణ్య అడవిలో దారి తప్పిపోయింది. హోమ్‌ స్టే యజమానికి ఫోన్ చేసి తను దారి తప్పానని, అధికారులకు తెలియచేయమని సమాచారం ఇచ్చింది. నేను తప్పిపోయా అన్న మెసేజ్‌ స్నేహితులకిచ్చేలోపే ఫోన్‌ స్విచాఫ్‌ అయింది. నిస్సహాయ స్థితిలో శరణ్య, ఒక వాగు పక్కన బండ రాయిపై కూర్చుని తనను ఎవరైనా రక్షిస్తారా అని ఎదురు చూస్తూ గడిపింది. ట్రెకింగ్ వెళ్లినందువల్ల వెంట ఆహారం తీసుకెళ్లలేదు. కేవలం ‌ వాటర్ బాటిల్ మాత్రమే ఉంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆకలిని తట్టుకునేందుకు వాగులోని నీటినే రోజుకు 3 లీటర్ల చొప్పున తాగుతూ కాలం గడిపింది. పైగా ఏనుగులు తిరిగే ప్రాంతంలో రాత్రిపూట వింత శబ్దాలు వినిపించాయి. అయినా ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో నిలబడింది. చివరికి ఒక మారుమూల ప్రాంతంలో స్థానికులు ఆమెను గుర్తించారు. ఆదివారం ఆమె అడవి నుంచి బయటకు రావడంతో రెస్క్యూ టీమ్, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యంగా తనకు పెద్దగా ఆకలి, భయం వేయలేదని తన అనుభవాన్ని శరణ్య గుర్తు చేసుకుంది. భవిష్యత్తులో ట్రెకింగ్ కొనసాగిస్తానని ధైర్యంగా చెప్పింది. అయితే శరణ్య ముఖంలో ఏ మాత్రం అలసట కానీ, తప్పిపోయిన బడలికగానీ కనిపించకపోవడంతో స్థానిక బీజేపీ నేతలు అనుమానించారు. క్రూర మృగాలతో నిండిన ఆ అడవిలో ఆమె బతికి బయటపడే అవకాశమే లేదనీ ఇదంతా ఆమె కావాలనే ఆడిన నాటకంగా ఆరోపించారు. ఆమె ప్రభుత్వం, ప్రజల విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసినందంటూ శరణ్యపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని కొడగు జిల్లా బిజేపీ నాయకులు డిమాండ్‌ చేసారు. అయితే దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు కానీ పిటిషన్‌పై దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mrunal Thakur: పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌

మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌

Follow Us