AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension: పెన్షనర్లకు శుభవార్త.. ఇక నెలవారీ పెన్షన్ రూ. 25,000 దాటవచ్చు..!

Pension: ఈసారి మూల వేతనంలో భారీ పెంపునకు అవకాశం ఉంది. జీతం, పెన్షన్ సర్దుబాట్లను నిర్ణయించడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన ఫార్ములా అయిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఈ సవరణ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పెన్షనర్లకు ఒక శుభవార్త ఉంది. అయితే నెల వారీ పెన్షన్..

Pension: పెన్షనర్లకు శుభవార్త.. ఇక నెలవారీ పెన్షన్ రూ. 25,000 దాటవచ్చు..!
Pension
Subhash Goud
|

Updated on: Apr 07, 2026 | 7:13 PM

Share

8th Pay Commission: దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు. వెలువడుతున్న ప్రతి నివేదిక ఉద్యోగుల అంచనాలను పెంచుతోంది. ఈసారి మూల వేతనంలో భారీ పెరుగుదల ఉండవచ్చని సూచనలు ఉన్నాయి. ఇప్పుడు పెన్షనర్లకు ఒక శుభవార్త అందుతోంది.

పెన్షన్ ఎంత పెరుగుతుంది?

8వ వేతన సంఘంలో పింఛను మొత్తంలో భారీ పెరుగుదల ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. పింఛను మొత్తం సుమారు 25% నుండి 35% వరకు పెరగవచ్చు. జీతం, పింఛను సర్దుబాట్లను నిర్ణయించడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన సూత్రమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఈ సవరణ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పింఛను రూ. 9,000గా ఉంది. నివేదికల ప్రకారం.. 8వ వేతన సంఘంలో ఇది రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువకు పెరగవచ్చు. పింఛను, జీతం ఎంత పెరుగుతాయో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price Drop: పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం ధర.. ఇంకా తగ్గుతుందా?

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ఏకీకృత పింఛను పథకం కూడా పరిశీలనలో ఉంది. దీనిని అమలు చేస్తే కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు, పదవీ విరమణకు ముందు చివరి 12 నెలల వారి సగటు మూల వేతనంలో 50 శాతానికి సమానమైన పింఛనును పొందుతారు.

ఇది కూడా చదవండి: D-Mart: డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు.. రాధాకిషన్ దమానీనా మజాకా..!

ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత్ అంబానీ భారీ విరాళం.. ఆ ఆలయానికి రూ.18 కోట్లు.. ఏనుగుల కోసం కూడా..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us