AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: అనంత్ అంబానీ భారీ విరాళం.. ఆ ఆలయానికి రూ.18 కోట్లు.. ఏనుగుల కోసం కూడా..!

Anant Ambani Donates: ఆలయ అధికారులు అనంత్ అంబానీకి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో అనంత్ మాట్లాడుతూ.. "భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు.. అవి సమాజాన్ని, ప్రకృతిని, కరుణను కలిపే జీవన సంస్థలు. ఈ గొప్ప..

Anant Ambani: అనంత్ అంబానీ భారీ విరాళం.. ఆ ఆలయానికి రూ.18 కోట్లు.. ఏనుగుల కోసం కూడా..!
Anant Ambani
Subhash Goud
|

Updated on: Apr 07, 2026 | 6:14 PM

Share

Anant Ambani Donates: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలైన రాజరాజేశ్వర ఆలయం, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాలను సందర్శించిన ఆయన, ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవల కోసం మొత్తం రూ.18 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అనంత అంబానీ తండ్రి ముఖేష్ అంబానీ భారతదేశం, ఆసియాలోని అత్యంత ధనవంతులలో ఒకరు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆయన నికర ఆస్తి విలువ $88.4 బిలియన్లు

ఆలయాల పునరుద్ధరణకు పెద్దపీట:

ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లా, తలిపరంబలో ఉన్న ప్రాచీన రాజరాజేశ్వర ఆలయానికి అనంత్ అంబానీ రూ. 3 కోట్ల విరాళం ఇచ్చారు. వీటితో పాటు ఈ ఆలయ సమగ్ర జీర్ణోద్ధారణ కోసం మరో రూ. 12 కోట్లు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిధులతో ఆలయ తూర్పు గోపురాన్ని పునర్నిర్మించడంతో పాటు, భక్తుల కోసం మౌలిక సదుపాయాలు, పార్కింగ్ వసతులను మెరుగుపరచనున్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Drop: పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం ధర.. ఇంకా తగ్గుతుందా?

ఇవి కూడా చదవండి

ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక ప్రాజెక్ట్:

అనంతరం త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయాన్ని సందర్శించిన అనంత్, ఆలయ ట్రస్టుకు రూ. 3 కోట్ల విరాళం అందజేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఆలయ సంప్రదాయాల్లో భాగమైన ఏనుగుల సంక్షేమం కోసం ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన కలల ప్రాజెక్ట్ ‘వంతారా’ స్ఫూర్తితో, గురువాయూర్ ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రి, షెల్టర్లు, ఆధునిక సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు మద్దతు ఇస్తానని ప్రకటించారు.

వారసత్వాన్ని కాపాడటం మన బాధ్యత:

ఈ సందర్భంగా ఆలయ అధికారులు అనంత్ అంబానీకి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో అనంత్ మాట్లాడుతూ.. “భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు.. అవి సమాజాన్ని, ప్రకృతిని, కరుణను కలిపే జీవన సంస్థలు. ఈ గొప్ప వారసత్వాన్ని రాబోయే తరాల కోసం కాపాడటం మనందరి బాధ్యత,” అని పేర్కొన్నారు.

  • అనంత్ అంబానీ కేరళలోని రెండు దేవాలయాలకు రూ.18 కోట్లు విరాళంగా ఇచ్చారు
  • రాజరాజేశ్వరం ఆలయానికి, గురువాయూర్ ఆలయానికి ఒక్కొ ఆలయానికి రూ.3 కోట్ల విరాళం
  • రాజరాజేశ్వరం ఆలయ పునరుద్ధరణకు ప్రత్యేకంగా రూ.12 కోట్లు విరాళంగా ఇవ్వనున్నాను
  • గురువాయూర్‌లోని ఆలయ ఏనుగుల సంరక్షణ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తామని హామీ

ఇది కూడా చదవండి: D-Mart: డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు.. రాధాకిషన్ దమానీనా మజాకా..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us