AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణ్‌బీర్‌ వర్సెస్‌ రణ్‌వీర్‌.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు

రణ్‌బీర్‌ వర్సెస్‌ రణ్‌వీర్‌.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 3:56 PM

Share

బాలీవుడ్‌లో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ మధ్య ఎవరు బెస్ట్ అనే చర్చ రచ్చగా మారింది. యానిమల్, రామాయణ విజయాలతో రణబీర్ దూసుకుపోతుంటే, ధురంధర్ సక్సెస్‌తో రణవీర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. కరీనా కపూర్ వంటి కుటుంబ సభ్యులు రణబీర్‌కు మద్దతు పలకగా, దీపిక మద్దతు లేకపోవడం రణవీర్‌కు చర్చనీయాంశమైంది. బాక్స్ ఆఫీస్ విజయాలే అసలైన నెంబర్ వన్ స్టార్‌ను నిర్ణయిస్తాయి.

ఎట్ ఎ టైమ్‌ ఇద్దరు హీరోలు పోటాపోటీగా కనిపిస్తున్నప్పుడు వారిద్దరిలో మంచీ చెడుల గురించి పోలికలు రావడం కామన్‌. ఇప్పుడు బాలీవుడ్‌లో అదే జరుగుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ లో ఎవరు బెస్ట్ అనే డిస్కషన్‌ షురూ అయింది. మా వాడే గొప్పంటే.. మా వాడే గొప్పంటూ బయటివారు చెప్పడం కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు డైరక్ట్ గా.. మరికొన్ని సార్లు ఇండైరక్ట్ గా. యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ యాక్టింగ్‌ చూసి వావ్‌ అన్నారు జనాలు. సందీప్‌ రెడ్డి ఫ్రేమ్‌లో పర్ఫెక్ట్ గా ఫిట్‌ అయ్యారని మెచ్చుకున్నారు. ఆ వెంటనే రామాయణలో నటిస్తున్నారని తెలిసి ముచ్చటపడ్డారు. రీసెంట్‌గా రాముడి గ్లింప్స్ రిలీజ్‌ చేశారు రామాయణ మేకర్స్. అసలైన చర్చ అప్పుడే మొదలైంది. రామాయణలో రాముడిని చూశాక.. రణ్‌బీర్‌కి తిరుగు లేదని మెచ్చుకున్నారు కరీనాకపూర్‌. తన దృష్టిలో బాలీవుడ్‌లో అలాంటి నటుడే లేదన్నది ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌. ధురంధర్‌ రిలీజ్‌ అయి సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అవుతున్న సమయంలో రణ్‌వీర్‌ గురించి మెచ్చుకోకుండా, రణ్‌బీర్‌ ప్రస్తావనను కరీనా ఎందుకు తెచ్చినట్టు అని డిస్కషన్‌ షురూ అయింది. ధురంధర్‌ సక్సెస్‌ అయ్యాక మెల్లిగా టాప్‌ పొజిషన్‌కి రణ్‌వీర్‌ వెళ్తు్న్నారన్నది క్రిటిక్స్ మాట. ఈ టైమ్‌లో అతనికి ఎవరి నుంచి ఎంత సపోర్ట్ ఉందన్నది హాట్‌ టాపిక్‌. దీపిక కనీసం ఒక పోస్టు కూడా పెట్టలేదన్న విషయం వైరల్‌ అయింది. అందరికన్నా ముందు ఆ సినిమాను చూసి మెచ్చుకుంది నేనే… ఆ విషయం మీకు తెలియదుగా అని చురక కూడా అంటించింది దీపిక. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ చాలా ముఖ్యమే. కొన్నిసార్లు సడన్‌ సక్సెస్‌లు, వాటిని కంటిన్యూ చేసుకోగల స్టామినా కూడా నెంబర్‌ వన్‌ పొజిషన్‌ని నిర్ణయిస్తుంది. ఒన్స్ ఆ రేంజ్‌కి రీచ్‌ అయితే ఆటోమేట్టిగా సపోర్ట్ దక్కుతుందని అంటున్నారు రణ్‌వీర్‌ సపోర్టర్స్.. రణవీర్‌ వర్సెస్‌ రణ్‌బీర్‌గా జరుగుతున్న పోటీలో నెగ్గేదెవరో తెలియాలంటే చెరి మరో రెండు సినిమాలు రిలీజ్‌ కావాల్సిందే. ఆ నెంబర్సే నిర్ణయిస్తాయి.. రేంజ్‌ని!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్‌ అవుతున్న పెద్ది స్పెషల్‌ సాంగ్‌ న్యూస్‌

ఇండస్ట్రీలో వైరల్‌ అవుతున్న హీరోయిన్ల అలవాట్లు

సినిమాలకు క్రేజ్‌ తీసుకొస్తున్న సెలబ్రిటీ కపుల్‌

బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో

కూతురికి విడాకులు మంజూరు.. కోర్టు బయట బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి

Published on: Apr 10, 2026 03:56 PM
Follow Us