AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో వైరల్‌ అవుతున్న హీరోయిన్ల అలవాట్లు

ఇండస్ట్రీలో వైరల్‌ అవుతున్న హీరోయిన్ల అలవాట్లు

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 3:36 PM

Share

కీర్తి సురేష్, సంయుక్త మీనన్ వంటి హీరోయిన్ల అలవాట్లు ఇప్పుడు ట్రెండింగ్. సంయుక్త వైన్ మాత్రమే అప్పుడప్పుడు తీసుకుంటానని చెప్పగా, కీర్తి సురేష్ మద్యపానానికి దూరంగా ఉంటారని సామ్ వెల్లడించారు. తెరపై 'మద్యపానం హానికరం' అని చెప్పినా, నిజ జీవితంలో సెలబ్రిటీలు దాన్ని ఎలా పాటిస్తారు? వారి వ్యక్తిగత అలవాట్లు, విజయాల కోసం ఎదురుచూపుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

హీరోయిన్లు.. వారి అలవాట్లు… ఇటీవలి కాలంలో ట్రెండ్‌ అవుతున్న విషయాల్లో ఇది చాలా ఇంపార్టెంట్‌ ప్లేస్‌లో ఉంది. ఆ మధ్య సంయుక్త మీనన్‌కి సంబంధించి వైరల్‌ అయిన ఓ టాపిక్‌, ఇప్పుడు కీర్తీ సురేష్‌ విషయంలోనూ రిఫ్లెక్ట్ అవుతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? మద్యపానం హానికరం అంటూ సినిమా స్టార్టింగ్‌లో అనౌన్స్ మెంట్‌ ఉంటుంది. అయితే సెలబ్రిటీలు రియల్‌ లైఫ్ లో దాన్ని ఫాలో అవుతారా? మిగిలిన వాళ్ల సంగతేమోగానీ, కొందరు మాత్రం బోల్డ్ గా ఆ విషయాన్ని గురించి మాట్లాడారు. అలాంటివారిలో రీసెంట్‌ గా వైరల్‌ అయ్యారు జాజికాయ సాంగ్‌ బ్యూటీ సంయుక్త. నేను రేర్‌గా మద్యపానం తీసుకుంటా. అందులోనూ వైన్‌ మాత్రమే అని అప్పట్లో ఆమె సంయుక్త చెప్పిన మాటలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఇదే టాపిక్‌ని కీర్తి సురేష్‌ యాంగిల్‌లో రివీల్‌ చేశారు సామ్‌. మహానటి కీర్తితో మంచి స్నేహమే ఉంది సామ్‌కి. అందుకే కీర్తి అలవాట్లన్నీ బాగా తెలుసు సిల్వర్‌స్క్రీన్‌ శకుంతలకి. కీర్తి మద్యపానాన్ని ముట్టుకోరు. కానీ, టంగ్‌ ట్విస్టర్స్ తో, తనకున్న సెన్స్ ఆఫ్‌ హ్యూమర్‌తో అర్ధరాత్రి వరకు అవతలివారిని నవ్విస్తూనే ఉంటారంటూ ది బెస్ట్ కాంప్లిమెంట్‌ ఇచ్చేశారు సామ్‌. గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్‌డూపర్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు కీర్తి. రౌడీ జనార్దనతో అనుకున్న సక్సెస్‌ వస్తుందనే ఆశతో ఉన్నారు. ఇటు సమంత కూడా మా ఇంటి బంగారం మూవీ కోసం వెయిటింగ్‌. ఈ ఏడాది ఎలాగైనా ఇద్దరూ సక్సెస్‌ చూసేయాలన్న పట్టుదలతో ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమాలకు క్రేజ్‌ తీసుకొస్తున్న సెలబ్రిటీ కపుల్‌

బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో

కూతురికి విడాకులు మంజూరు.. కోర్టు బయట బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి

నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!

Mrunal Thakur: పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌

Follow Us