AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురికి విడాకులు మంజూరు.. కోర్టు బయట బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి

కూతురికి విడాకులు మంజూరు.. కోర్టు బయట బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి

Phani CH
|

Updated on: Apr 10, 2026 | 12:50 PM

Share

భారత సమాజంలో విడాకులు ఇప్పటికీ కళంకంగా చూడబడుతున్నాయి. అయితే, మీరట్‌లో ఒక రిటైర్డ్ జడ్జి తన కుమార్తె విడాకులను డప్పులు, మిఠాయిలతో సంబరంగా జరుపుకుని కొత్త ఒరవడి సృష్టించారు. అత్తమామల వేధింపులతో విడాకులు పొందిన ప్రణీతకు ఆమె తండ్రి పూర్తి మద్దతుగా నిలిచారు. ఇది విడాకులను చూసే విధానాన్ని మార్చి, మహిళలకు ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది.

విడాకులను ఇప్పటికీ ఓ కళంకంగా చూస్తుంది భారత సమాజం. అటు అబ్బాయి తరఫు వాళ్ల నుంచే సమస్యలు వచ్చినా కూడా ఆ అమ్మాయే తప్పు చేసినట్లుగా చూస్తుంది. చుట్టుపక్కల వాళ్ల ప్రభావంతో పుట్టింటివాళ్లు అండగా నిలబడేందుకు ముందుకు రారు. భర్త వదిలేసిన స్త్రీ పట్ల అనాదిగా ఉన్న భావనను తుడిచివేసేలా కొందరు తండ్రులు ముందుకు వస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రణీతకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు అయిన వెంటనే ఆమె తండ్రి అయిన రిటైర్డ్‌ జడ్జ్.. బయట డప్పులు వాయిస్తూ..మిఠాయిలు పంచుతూ ఆ క్షణాన్ని సెలబ్రేట్‌ చేశారు. బంధువులు డప్పుల శబ్దానికి నృత్యం చేస్తూ లడ్డూలు పంచారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తండ్రితో పాటు కుటుంబ సభ్యులు నల్లటి టీ షర్టులు ధరించి కనిపించారు. దానిపైన ప్రణీత ఫోటో తో పాటు “నా కూతురిని ప్రేమిస్తున్నాను. ఆమె నా హృదయం, ఆమె నా సర్వస్వం ” అని సందేశం ముద్రించి ఉంది. ప్రణీత కూడా “నా కుటుంబం, నా జీవితం” అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టును ధరించింది. 2018లో భారత సైన్యంలోని ఓ మేజర్ తో ప్రణీతకు వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ప్రణీత తన అత్తమామల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంది. పరిస్థితి దిగజారడంతో, ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రణీత కుటుంబం అప్పటికే వ్యక్తిగత నష్టాన్ని చవిచూసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణీత సోదరుడు మరణించడం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో ఆ తండ్రి తన కూతురుకు అండగా నిలిచి, తన శ్రేయస్సు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!

Mrunal Thakur: పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌

మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌

Follow Us