Peddi: పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్ అవుతున్న పెద్ది స్పెషల్ సాంగ్ న్యూస్
పెద్ది సినిమాకు సంబంధించి మృణాల్ ఠాకూర్, మానస వారణాసి పేర్లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. పెద్ది స్పెషల్ సాంగ్‌లో మృణాల్ నటిస్తుందని గతంలో వార్తలు రాగా, ఆమె మౌనం వహించింది. ఇప్పుడు మానస వారణాసి పేరు తెరపైకి వచ్చింది. మృణాల్ స్థానంలో మానస వస్తుందా, లేక ఇద్దరూ కలిసి స్టెప్పులేస్తారా అనే చర్చ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. సినిమా షూటింగ్, రిలీజ్ డిస్కషన్స్‌ను మించి ఈ సాంగ్ గురించే చర్చ జరుగుతోంది.
ట్రెండింగ్ టాపిక్స్ ఏం ఉన్నాయని అలా ఓ లుక్ వేస్తే… కన్‌ఫర్మ్ గా కనిపిస్తున్న హ్యాష్ ట్యాగ్స్ పెద్ది అండ్ మృణాల్. ఇప్పుడు వీరిద్దరికీ తోడు ఇంకో పేరు యాడ్ అయింది. ఇంతకీ ఎవరిది ఆ పేరు? ఈ రెండు పేర్లతో ఉన్న లింకు ఏంటి? పెద్ది సినిమా షూటింగ్ ఇంకెంత ఉంది? చెప్పిన టైమ్‌కి రిలీజ్ అవుతుందా? లేదా? అనే డిస్కషన్ ఎంత ముమ్మరంగా జరుగుతుందో… అంతకు మించిన టాపిక్ మరోటి వైరల్ అవుతోంది. అదే పెద్ది స్పెషల్ సాంగ్ గురించి. పెద్దిలో మృణాల్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారన్నది నిన్న మొన్నటిదాకా వైరల్ అయిన విషయం. ఇదే టాపిక్‌తో కొందరు మృణాల్‌తో ప్రస్తావించినప్పుడు సైలెంట్‌గా ఓవర్ లుక్ చేసేశారు ఈ బ్యూటీ. అప్పటి నుంచి రూమర్స్ మరింతగా స్ప్రెడ్ అయ్యాయి. కాకపోతే, ఇప్పుడు మృణాల్ ప్లేస్‌లో మానస వారణాసి పేరు వినిపిస్తోంది. కపుల్ ఫ్రెండ్లీతో సూపర్ డూపర్‌గా క్లిక్ అయిన ఈ లేడీ చెర్రీతో స్పెషల్‌గా స్టెప్పులేయడానికి రెడీ అయిపోతున్నారన్నదే ఈ టాక్. నిజానికి మృణాల్‌ని మానస రీప్లేస్ చేస్తున్నారా? లేకుంటే ఇద్దరూ కలిసి చెరోవైపు స్టెప్పులేయడానికి సిద్ధమవుతున్నారా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో ఇంట్రస్టింగ్ టాపిక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న హీరోయిన్ల అలవాట్లు
సినిమాలకు క్రేజ్ తీసుకొస్తున్న సెలబ్రిటీ కపుల్
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. కోర్టు బయట బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

