AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది.. టాలీవుడ్ హీరో మూవీపై పీవీ సింధు ప్రశంసల వర్షం

ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు బ్యాడ్మింటన్ గేమ్ గురించి తప్పితే సినిమాల గురించి పెద్దగా మాట్లాడదు. అలాంటిది ఆమె తాజాగా ఓ తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించింది. సోషల్ మీడియా వేదికగా హీరో, హీరోయిన్, దర్శక నిర్మాతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది.

PV Sindhu: ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది.. టాలీవుడ్ హీరో మూవీపై పీవీ సింధు ప్రశంసల వర్షం
PV Sindhu
Basha Shek
|

Updated on: Apr 10, 2026 | 4:59 PM

Share

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ‘బైకర్’. గత వారం విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. సామాన్య ప్రేక్షకులే కాదు పలువురు సినిమా ప్రముఖులు కూడా బైకర్ సినిమాను చూస్తున్నారు. అనంతరం సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది వరకే అక్కినేని అందగాడు హీరో నాగార్జున బైకర్ సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వి. సింధు శర్వానంద్ సినిమాపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ వేదికగా బైకర్ సినిమా పోస్టర్ ను పంచుకున్న ఆమె.. ‘ఒక క్రీడాకారిణిగా నాకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన పట్టుదల, వేగం, ఏకాగ్రత వంటి అంశాలు ఈ సినిమాలో బలంగా ప్రతిబింబించాయి. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలి’ అని పీవీ సిందు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ తో పాటు దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర, హీరోయిన్ మాళవిక నాయర్ సహా మొత్తం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపింది ఒలింపిక్ ఛాంపియన్. ఇక సింధు పోస్ట్ పై బైకర్ మూవీ నిర్మాతలు కూడా స్పందించారు. తమ చిత్రాన్ని చూసి అప్రిషియేట్ చేసినందుకు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ పీవీ సింధుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు సీనియర్ హీరో రాజశేఖర్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేశారు. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించింది. అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. కాగా సినిమాకు కొన్ని చోట్ల నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్లతో బైకర్ దూసుకుపోతోంది. ఈ ఏడాదికి నారీ నారీ నడుమ మురారితో హిట్ అందుకున్న శర్వా బైకర్ తో వరుసగా రెండో హిట్ అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

థ్యాంక్స్ సింధూ.. బైకర్స్ నిర్మాతల పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొత్త ఆధార్ యాప్‌తో మీ పనులు ఇక క్షణాల్లో!
కొత్త ఆధార్ యాప్‌తో మీ పనులు ఇక క్షణాల్లో!
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు
ఈ 4 చెడు అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేస్తాయా? గరుడ..
ఈ 4 చెడు అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేస్తాయా? గరుడ..
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో పాములు.. భయంలో జనం
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో పాములు.. భయంలో జనం
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు