Trolls On Cricketer: నువ్వు ఇచ్చిన డ‌బ్బులకు ఒక్క వెంటిలేట‌ర్ కూడా రాదు.. చాహాల్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్‌..

Trolls On Yuzvendra Chahal: భార‌త్‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న కేసుల‌తో ప‌రిస్థితులు దిగ‌జారిపోతున్నాయి. ఆక్సిజ‌న్లు, బెడ్లు స‌రిపోక చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు...

Trolls On Cricketer: నువ్వు ఇచ్చిన డ‌బ్బులకు ఒక్క వెంటిలేట‌ర్ కూడా రాదు.. చాహాల్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్‌..
Chalhal Trolled
Follow us
Narender Vaitla

|

Updated on: May 10, 2021 | 7:23 PM

Trolls On Yuzvendra Chahal: భార‌త్‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న కేసుల‌తో ప‌రిస్థితులు దిగ‌జారిపోతున్నాయి. ఆక్సిజ‌న్లు, బెడ్లు స‌రిపోక చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇక స‌మ‌యానికి ఆక్సిజ‌న్ అంద‌క కొంద‌రు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ క్ర‌మంలోనే దేశాన్ని ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి కొంద‌రు సెల‌బ్రిటీలు త‌మ వంతు కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టీమిండియా ప్లేయ‌ర్స్ త‌మ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ, అనుష్క ఒక మంచి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దేశంలో క‌రోనా బాధితుల‌కు అండ‌గా నిలిచే క్ర‌మంలో రూ. రెండు కోట్లు విరాళంగా అందించారు. అంత‌టితో ఆగ‌కుండా ఇత‌రుల‌ను సాయం చేయాల‌ని కోరారు. రూ. 7 కోట్లు స‌మ‌కూర్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారీ స్టార్ క‌పుల్‌. ఈ జంట ఇచ్చిన పిలుపున‌కు స్పందించి ఇప్ప‌టికే ప‌లువురు విరాళాలు అందించారు. కేవ‌లం 24 గంట‌ల్లోనే రూ. 3.6 కోట్లు అందాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా టీమిండియా ఆట‌గాడు యుజువేంద్ర చాహాల్‌ కూడా విరాళం అందించాడు. ఇందులో భాగంగా చౌహాన్ త‌న వంతు సాయంగా రూ. 95 వేలు అందించాడు. అయితే మంచి ఉద్దేశంతో విరాళం అందించినా.. అత‌నిపై నెట్టింట ట్రోలింగ్ పెరిగింది. ఐపీఎల్ వంటి క్రీడ‌ల్లో ఆడుతూ రూ. కోట్ల‌లో సంపాదిస్తూ ఇంత త‌క్కువ విరాళం అందిస్తావా.? అంటూ కొంద‌రు. అత‌ను కోట్ల రూపాయ‌లు సంపాదిస్తూ రూ. 95 వేలే విరాళం ఇచ్చాడ‌ని చేశాడ‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఓ వ్య‌క్తి చాహాల్‌ ఇచ్చిన రూ. 95 వేల‌తో ఒక్క వెంటిలేట‌ర్ కూడా రాద‌ని విమ‌ర్శించాడు. ఇదిలా ఉంటే మ‌రికొంద‌రు మాత్రం అస‌లే ఇవ్వ‌క‌పోవ‌డం కంటే ఎంతో కొంత ఇవ్వ‌డం మంచిదే క‌దా అంటూ చౌహాల్‌కు అండ‌గా నిలుస్తున్నారు.

Also Read: తండ్రి కాబోతున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేసర్.. తన ఫియాన్సీ ఫోటోను షేర్ చేసిన పాట్ కమిన్స్‌

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Virat Kohli: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ..