తండ్రి కాబోతున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేసర్.. తన ఫియాన్సీ ఫోటోను షేర్ చేసిన పాట్ కమిన్స్‌

ఆస్ట్రేలియాపేసర్ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు పాట్ కమిన్స్‌ తండ్రి కాబోతున్నాడు. కమిన్స్‌ ప్రేయసి, కాబోయే భార్య బెకీ బోస్టన్‌ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాను తండ్రిని కాబోతున్నట్లుగా బేబీ బంప్‌తో ఉన్న...

తండ్రి కాబోతున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేసర్.. తన ఫియాన్సీ ఫోటోను షేర్ చేసిన పాట్ కమిన్స్‌
Pat Cummins And His Fiancee
Follow us
Sanjay Kasula

|

Updated on: May 10, 2021 | 5:20 PM

ఆస్ట్రేలియాపేసర్ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు పాట్ కమిన్స్‌ తండ్రి కాబోతున్నాడు. కమిన్స్‌ ప్రేయసి, కాబోయే భార్య బెకీ బోస్టన్‌ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాను తండ్రిని కాబోతున్నట్లుగా బేబీ బంప్‌తో ఉన్న బెకీ ఫొటోను కమిన్స్‌ షేర్‌ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘తొలి మాతృదినోత్సవం.. మినీ బంప్‌తో’ అంటూ కమిన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘మదర్స్‌ డే రోజు ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటూ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ట్వీట్ చేసింది.

ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్లు కొందరు స్వంత దేశాలకు వెళ్లగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల కారణంగా పాట్ కమిన్స్‌ ఇప్పటికీ స్వదేశానికి వెళ్లలేకపోయాడు. మాల్దీవులు చేరుకొని అక్కడ క్వారంటైన్ అయ్యాడు. ఆపై ఆసీస్ చేరుకొని మరోసారి క్వారంటైన్ అవుతాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కమిన్స్‌.. కరోనాపై భారత్‌ సాగిస్తున్న పోరులో భాగంగా తన వంతు విరాళం అందించి పెద్దమనసు చాటుకున్న సంగతి తెలిసిందే.

ఆడిన ఏడు మ్యాచుల్లో కమిన్స్‌ ఆకట్టుకున్నాడు. ఇదిలావుంటే.. ఫిబ్రవరిలో పాట్ కమిన్స్‌-బెకీ బోస్టన్‌ నిశ్చితార్థం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించుకున్నారు. అయితే కరోనా కారణంగా కొద్ది మంది మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఆసీస్‌ జట్టులో కమిన్స్‌ కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కమిన్స్‌ ఆసీస్ తరఫున 34 టెస్టులు, 69 వన్డేలు, 30 టీ20లు ఆడాడు.

మానసికంగా సిద్ధమైనపుడే పెళ్లి

నిజానికి ఐపీఎల్‌ 2021 ఆడుతున్న సమయంలోనే పాట్ కమిన్స్‌, బెకీ బోస్టన్‌ తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న గుడ్ న్యూస్‌ను షేర్ చేశారు. ‘ఈ సంతోషాన్ని ఇక దాచి ఉంచటం నావల్ల కాదు. బేబీ బోస్టన్‌ కమిన్స్‌ రాబోతోంది. నిన్ను కలవడానికి మేమెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’ అంటూ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘మేం సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాం. మేం మానసికంగా సిద్ధమైనపుడే పెళ్లి చేసుకుంటాం. ఈలోపే చిన్నారి మా జీవితాల్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. బెకీ, బేబీ బాగున్నారు’ అని పేర్కొన్నాడు.

 ఇవి కూడా చదవండి : Aadhaar: ఆధార్‌లోని అడ్రస్‌ను మార్చడం అద్దెదారులకు ఇక చాలా ఈజీ..! అయితే ఇలా చేయండి..!

Modi KCR: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌.. సీఎంను అభినందించిన మోదీ

కరోనా ఒత్తిడిని డార్క్ చాక్లెట్ తగ్గిస్తుందా.? ఆరోగ్య మంత్రి సూచనలు.. సాక్ష్యమేదంటున్న నిపుణులు..