కరోనా ఒత్తిడిని డార్క్ చాక్లెట్ తగ్గిస్తుందా.? ఆరోగ్య మంత్రి సూచనలు.. సాక్ష్యమేదంటున్న నిపుణులు..
Dark Chocolate Beats Covid 19: కరోనా బాధితులు ఎక్కువ శాతం పౌష్టికాహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలని కొన్ని రోజులుగా..
Dark Chocolate Beats Covid 19: కరోనా బాధితులు ఎక్కువ శాతం పౌష్టికాహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలని కొన్ని రోజులుగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటుందని.. అందుకే సరైన ఆహారం తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పేషెంట్లు తీసుకోవాల్సిన ఫుడ్ పై పలు సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే కరోనా తాలూకు ఆందోళనను అదుపులో ఉంచుకోవడానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు కొద్ది మొత్తంలో తీసుకోవాలని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు దీనిపై పెద్ద దుమారం రేగింది. కరోనా తాలూకు ఒత్తిడిని అదుపు చేసేందుకు డార్క్ చాక్లెట్ పని చేస్తుందనడానికి సరైన సాక్ష్యాలు చూపించాలంటూ ఆరోగ్య నిపుణులు మంత్రిని ప్రశ్నిస్తున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచడానికి ఒత్తిడిని తగ్గించేందుకు డార్క్ చాక్లెట్‌తో సహా పలు రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తూ తాజాగా హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. విటమిన్స్, ఖనిజ పదార్ధాలను పెంచడానికి కూరగాయలు, పండ్లను కూడా తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే డార్క్ చాక్లెట్‌పై మంత్రి సలహాకు ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. “డార్క్ చాక్లెట్ కరోనా ఒత్తిళ్లను తగ్గిస్తుందని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి?” అని మంత్రిని బయోఎథిక్స్ పరిశోధకుడు అనంత్ భన్ ట్విట్టర్ వేదికగా అడిగారు.
అంతేకాకుండా “ఎంతమంది డార్క్ చాక్లెట్లను కొనగలరు” అని అనంత్ భన్, మరికొందరు మంత్రిని ప్రశ్నిస్తూ.. రుజువులతో కూడిన ప్రకటనలు చేయాలని హితవు పలికారు. కాగా, శనివారం లాన్సెట్ మెడికల్ జర్నల్ ఇండియా కోవిడ్ ఎండ్‌గేమ్‌లో ఉందని హర్షవర్ధన్ మార్చిలో చేసిన స్టేట్ మెంట్ పై ప్రశ్నించింది.
ఇవీ చదవండి:
Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!
Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!
Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!