మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్..ఆస్తుల వేలంకు రంగం సిద్దం

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్..ఆస్తుల వేలంకు రంగం సిద్దం

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్ తగిలింది. ఈ సారి గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. గ౦టాకి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ అతి కీలక నిర్ణయం తీసుకుంది.

Ram Naramaneni

|

Nov 12, 2020 | 9:27 PM

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్ తగిలింది. ఈ సారి గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. గ౦టాకి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ అతి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 25న వేల౦ నిర్వహించనున్నారు బ్యాంకు అధికారులు.  ప్రత్యూష కంపెనీలోని తొమ్మిది రకాలైన ఆస్తులకు  వేలం జరగనుంది. గతంలో రూ. 248 కోట్ల రూపాయల మేర  ప్రత్యూష క౦పెనీ బ్యాంక్  రుణం తీసుకుంది. ఆ లోన్ తాలూకా వడ్డీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.  మెుదటిసారిగా 2006 అక్టోబర్ 4న రుణ౦ చెల్లి౦చాల౦టూ బ్యాంకు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సమాధానం రాని క్రమంలో..  2006 డిసెంబర్ 27న, తిరిగి 2017 ఫిబ్రవరి 21న బ్యాంకులో ప్రత్యూష కంపెనీ కుదవ బెట్టిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  విశాఖలోని కీలకమైన ప్రాంతాలలో ఉన్న భవనాలు, రుషికొండ వద్ద ఉన్న స్థలాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

Also Read : 

నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !

Alert : ఏపీకి భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఆ జిల్లాలకు

ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu