ఇండోర్ స్టేడియం క్రికెట్ పిచ్‌పై చేతబడి కలకలం
కర్నూలు జిల్లాలో చేతబడి కలకలం సృష్టించింది. సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ పిచ్‌పై చేతబడి భయాందోళనలకు గురిచేసింది.
కర్నూలు జిల్లాలో చేతబడి కలకలం సృష్టించింది. సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ పిచ్‌పై చేతబడి కలకలం రేపింది. పిచ్‌పై ముగ్గులు వేసి దుండగులు దీపాలు వెలిగించారు. నిమ్మకాయ, పసుపు, కుంకుమ వేసి క్షుద్రపూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. ఆ ప్రాంతానికి చెందిన విద్యార్థులంతా ఇక్కడే క్రికెట్ ఆడుతుంటారు. క్రికెట్ మైదానంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక పెద్ద బొమ్మ గీసి నిమ్మకాయలు, గుమ్మడికాయలు పెట్టి మేకులు కొట్టి పూజలు చేసినట్లు చిత్రాలు ఉన్నాయి. ఇది చేతబడే అని విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతబడి యత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.