భారత ఖగోళ శాస్త్రవేత్తల మరో ఘనత
భారత అంతరిక్ష ఖగోళ శాస్త్రవేత్తలు మరో మైలురాయి దాటారు. సౌరవ్యవస్థలో ఓ సుదూర గెలాక్సీని కనుగొన్నారు చరిత్రలో నిలిచారు. దేశ మొట్టమొదటి మల్టీ-వేవ్‌లెంగ్త్ స్పేస్ అబ్జర్వేటరీ ‘ఆస్ట్రోసాట్’ (యూవీఐటీ)ను ఉపయోగించి గెలాక్సీ నుంచి వస్తున్న యూవీ కాంతిని గుర్తించారు.
భారత అంతరిక్ష ఖగోళ శాస్త్రవేత్తలు మరో మైలురాయి దాటారు. సౌరవ్యవస్థలో ఓ సుదూర గెలాక్సీని కనుగొన్నారు చరిత్రలో నిలిచారు. దేశ మొట్టమొదటి మల్టీ-వేవ్‌లెంగ్త్ స్పేస్ అబ్జర్వేటరీ ‘ఆస్ట్రోసాట్’ (యూవీఐటీ)ను ఉపయోగించి గెలాక్సీ నుంచి వస్తున్న యూవీ కాంతిని గుర్తించారు. పుణెలోని ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసీఏఏ) కు చెందిన డాక్టర్ కనక్ సాహా నేతృత్వంలోని బృందం భూమికి 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న యూవీ కాంతి వస్తున్నట్లు కనుగొన్నారు. అక్కడ ఒక గెలాక్సీని గుర్తించి.. దానికి ఏయూడీఎఫ్‌ఎస్ 01 అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన కృషీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ అధ్యయనాన్ని బ్రిటన్ నుంచి వెలువడుతున్న ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘నేచర్ ఆస్ట్రానమీ’లో ప్రచురించారు. భారతదేశం ఆస్ట్రోసాట్ యూవీఐటీ ఈ ప్రత్యేకమైన ఘనతను సాధించగలిగింది. యూవీఐటీ డిటెక్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అనేది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్‌లో కంటే ఇది చాలా చిన్నది. ఈ ఆవిష్కరణ చేసిన భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష అబ్జర్వేటరీ ఆస్ట్రోసాట్‌ను మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో 2015 సెప్టెంబర్ 28 న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రారంభించింది. ఇస్రో పూర్తి సహకారంతో ఐయూసీఏఏ మాజీ ఎమెరిటస్ ప్రొఫెసర్ శ్యామ్ టాండన్ నేతృత్వంలోని బృందం దీనిని అభివృద్ధి చేసింది. కాగా, ఈ ఆవిష్కరణ విశ్వం గుట్టు విప్పేందుకు చాలా ఉపయోగపడుతుందని ఐయూసీఏఏ డైరెక్టర్ డాక్టర్ సోమక్ రే చౌదరి పేర్కొన్నారు.