AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs New Zealand 1st ODI: మరోసారి వర్షం ఎఫెక్ట్.. ఆగిన మ్యాచ్..

India vs New Zealand, 1st ODI: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ బౌలింగ్‌లో మిచెల్ శాంట్నర్ క్యాచ్ పట్టడంతో అతను అవుటయ్యాడు. ఏడు ఓవర్ల తర్వాత భారత్ 36 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు.

India vs New Zealand 1st ODI: మరోసారి వర్షం ఎఫెక్ట్.. ఆగిన మ్యాచ్..
Ind Vs Nz 1st Odi Toss
Venkata Chari
|

Updated on: Nov 04, 2026 | 1:57 PM

Share

India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ బౌలింగ్‌లో మిచెల్ శాంట్నర్ క్యాచ్ పట్టడంతో అతను అవుటయ్యాడు. ఏడు ఓవర్ల తర్వాత భారత్ 36 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు.

భారత్‌కు 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆక్లాండ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు, గుర్నూర్ బ్రార్ మూడు, మరియు అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లు పడగొట్టారు.

సీఫర్ట్, ఫిలిప్స్ పోరాటం వృథా..

న్యూజిలాండ్ తరఫున టిమ్ సీఫర్ట్ (Tim Seifert) 43 బంతుల్లో 38 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) 51 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 41 బంతుల్లో 28 పరుగులు చేశాడు. చివర్లో బ్లెయిర్ టిక్నర్ (Blair Tickner) మెరుపులు మెరిపించాడు. కేవలం 23 బంతుల్లో 34 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. జాకబ్ డఫీ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్ల ప్రదర్శన అదుర్స్..

అర్ష్‌దీప్ సింగ్ 10 ఓవర్లలో 70 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ బ్రార్ 9.2 ఓవర్లలో 44 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. అన్షుల్ కాంబోజ్ 10 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖ్యంగా రెండు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. అక్షర్ పటేల్ ఐదు ఓవర్లలో 12 పరుగులే ఇచ్చాడు.

న్యూజిలాండ్ బ్యాటింగ్ స్కోరు..

టిమ్ సీఫర్ట్ – 38 (43)

గ్లెన్ ఫిలిప్స్ – 30 (51)

డారిల్ మిచెల్ – 28 (41)

బ్లెయిర్ టిక్నర్ – 34 (23)

జాకబ్ డఫీ – 15* (21)

విల్ యంగ్ – 9

హెన్రీ నికోల్స్ – 9

మిచెల్ సాంట్నర్ – 4

టామ్ లాథమ్ – 3

నాథన్ స్మిత్ – 1

కైల్ జేమీసన్ – 1

న్యూజిలాండ్: 185/10 (40.2 ఓవర్లు)

భారత బౌలింగ్ గణాంకాలు..

అర్ష్‌దీప్ సింగ్ – 4/70

గుర్నూర్ బ్రార్ – 3/44

అన్షుల్ కాంబోజ్ – 2/22

అక్షర్ పటేల్ – 0/12

ఆకిబ్ నబీ – 0/33

ఇప్పుడు భారత్ విజయానికి 186 పరుగులు చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ బ్యాటర్లు బరిలోకి దిగనుండటంతో టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

భారత్ తుది జట్టు (Playing XI)..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ తుది జట్టు (Playing XI)..

టిమ్ సీఫర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్.

ఇప్పుడు అందరి దృష్టి భారత బౌలర్లపై ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్లను ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపిస్తారో చూడాలి. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us