కరోనా అప్‌డేట్ : దేశంలో కొత్తగా 41,810 పాజిటివ్ కేసులు, 42,298 రికవరీలు..డెత్ రేటు ఎంతంటే..?

దేశంలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 41,810 మంది వైరస్‌ బారిన పడ్డారు.

  • Ram Naramaneni
  • Publish Date - 11:10 am, Sun, 29 November 20
కరోనా అప్‌డేట్ : దేశంలో కొత్తగా 41,810 పాజిటివ్ కేసులు, 42,298 రికవరీలు..డెత్ రేటు ఎంతంటే..?

దేశంలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 41,810 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తంగా 93,92,920కి చేరింది. నిన్న ఒక్కరోజే 496 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,696 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,53,956 యాక్టీవ్ కేసులున్నాయి. నిన్న కొత్తగా 42,298 మంది వ్యాధి నుంచి కోలుకోగా… ఇప్పటివరకు 88,02,267 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 12,83,449 కరోనా టెస్టులు చేశారు. దేశంలో ప్రస్తుతం 4.83శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అలాగే రికవరీ రేటు 93.71 శాతానికి పెరిగింది.  డెత్ రేటు 1.46శాతంగా ఉంది.

అమిత్ షా హైదరాబాద్ పర్యటన లైవ్ అప్డేట్స్ కోసం దిగువ లింక్ క్లిక్ చేయండి :