మహానగరంలో మాయగాడు.. ఒంటరి యువతులే అతడి టార్గెట్.. ఉద్యోగం పేరిట నమ్మించి నయవంచన చేస్తాడు..
అతడో మహా ముదురు. ఒంటరిగా కనిపించే యువతులే అతడి టార్గెట్. ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలతో నమ్మిస్తాడు. అధిక సాలరీ వస్తుందని ఆశ చూపుతాడు. ఆపై వ్యభిచారకూపంలోకి నెట్టేస్తాడు. మహానగరంలో మాయగాడిగా ఉంది ఎవ్వారం.
అతడో మహా ముదురు. ఒంటరిగా కనిపించే యువతులే అతడి టార్గెట్. ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలతో నమ్మిస్తాడు. అధిక సాలరీ వస్తుందని ఆశ చూపుతాడు. ఆపై వ్యభిచారకూపంలోకి నెట్టేస్తాడు. మహానగరంలో మాయగాడిగా ఉంది ఎవ్వారం. పశ్చిమ బెంగాల్‌లో ఉండే మహ్మద్ వసీం దువాభక్ష్ షేక్, పొద్దంతా కూరగాయల వ్యాపారం చేసి సాయంత్రానికల్లా అమ్మాయిలతో బిజినెస్ చేస్తుంటాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమ బెంగాల్‌లో ఉండే మహ్మద్ వసీం దువాభక్ష్ షేక్ కూరగాయల వ్యాపారం చేస్తున్నానని చెప్పి తెర వెనుక ముంబైకి అమ్మాయిలను తరలిస్తాడు. ఇతడికి ముంబైలోని సెక్స్ రాకెట్ ముఠాలతో సంబంధాలున్నాయి. తాజాగా ఇటీవల ఓ ఇద్దరు యువతులను ముంబై తీసుకువచ్చి సిటీకి దూరంగా ఉన్న ఓ బూతు బంగ్లాలో ఉంచాడు. రెండు రోజుల తర్వాత విటులతో సెక్స్ చేయాలని వారిని బలవంతపెట్టాడు. అమ్మాయిలు ఒప్పుకోకపోవటంతో విచక్షణా రహితంగా చితక్కొట్టాడు. తాము అలాంటి వాళ్లం కాదని, దయచేసి తమను వదిలేయాలని బతిమాలాడినే వినకుండా రోజుల తరబడి టార్చర్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆ బంగ్లా దగ్గరి నుంచి అటుగా వెళుతున్న ఓ యువకుడికి అమ్మాయిల ఏడుపులు వినిపించాయి. దీంతో అతడు ఓ స్వచ్ఛంద సంస్థకు ఫోన్‌చేసి సమాచారం తెలియజేశాడు. వాళ్లు వెంటనే పోలీసులతో వచ్చి బంగ్లాపై రైడింగ్ చేయగా మహ్మద్ వసీం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. పోలీసులు పాపం అక్కడే మూలకు కూర్చొని ఉన్న యువతులను విడిపించి వారి సొంత గ్రామాలకు తరలించారు. వసీంపై కేసు నమోదు చేసి విచారణ చేయగా సెక్స్ రాకెట్ గుట్టు చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు మరికొంత మంది బ్రోకర్ల వేటలో ఉన్నారు.
అమిత్ షా హైదరాబాద్ టూ లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్‌ను క్లిక్ చేయండి