ఇండియాలో క‌రోనా విల‌యం : ఒక్క‌రోజే 57 వేలకుపైగా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య వీర‌విహారం చేస్తోంది. రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 57,117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇన్ని కేసులు న‌మోద‌వ్వ‌డం ఇదే మొద‌టిసారి.

ఇండియాలో క‌రోనా విల‌యం : ఒక్క‌రోజే  57 వేలకుపైగా కేసులు

India Fights Corona  : దేశంలో కరోనా కేసుల సంఖ్య వీర‌విహారం చేస్తోంది. రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 57,117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇన్ని కేసులు న‌మోద‌వ్వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో మొత్తం క‌రోనా సోకిన‌వారి సంఖ్య 16,95,988కి పెరిగింది. కొత్త‌గా మరో 764 మంది బాధితులు కరోనా కార‌ణంగా మృతి చెందారు. ఇప్పటివరకు వైర‌స్ వ‌ల‌న ప్రాణాలు విడిచినవారి సంఖ్య 36,511కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 5,65,103 ఉండ‌గా..వ్యాధి బారి నుంచి కోలుకున్నవారు 10,94,374 మంది ఉన్నారు.

కరోనా వైర‌స్ అన్నీ రాష్ట్రాల్లోనూ ప్ర‌మాద‌కరంగానే విస్త‌రిస్తోంది. మ‌హారాష్ట్ర‌లో మొత్తం బాధితుల సంఖ్య 4,22,118కు చేరింది. మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో 15 వేలకు చేరువైంది. మొత్తం 2,56,158 మంది వ్యాధి నుంచి బయటపడ్డారు.

కన్నడ నాట కరోనా విలయం భ‌యాన‌కంగా ఉంది. వరుసగా ఎనిమిదో రోజూ 5 వేలకు పైగా కోవిడ్​ కేసులు నమోదయ్యాయి. అక్క‌డ మొత్తం మృతుల సంఖ్య 2,314కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 49,788 మంది వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మొత్తం 1,24,115 మంది కొవిడ్​ బారినపడగా.. సుమారు 72 వేల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తమిళనాడులో కరోనా తీవ్ర‌త అధికంగానే ఉంది. ఒక్కరోజులో 5,881 మందికి కరోనా నిర్దార‌ణ అయ్యింది. మరో 97మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,45,859కి చేరింది. మృతుల సంఖ్య 3,935కి పెరిగింది. ప్రస్తుతం 57,968 మంది వివిధ ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్నారు.

 

Read More : ఆగ‌స్టు నెలలో స్థిరంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు : తాజా రేట్లు ఇలా

Click on your DTH Provider to Add TV9 Telugu