India Corona: గుడ్ న్యూస్.. దేశ ప్రజలకు భారీ ఊరట.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు.. పూర్తి వివరాలు!
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,703 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,703 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,19,932కి చేరింది. ఇందులో 4,64,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 51,864 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,97,52,294కి చేరింది.
అటు నిన్న 553 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,03,281 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 36,13,23,548 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరించడంతో కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం వేగవంతం చేసింది. అలాగే రాష్ట్రాలకు కూడా పలు సూచనలు ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరగకుండా ఉండేలా టెస్టులు పెంచడమే కాకుండా వ్యాక్సిన్ పంపిణీలో సైతం వేగం పెంచాలని కోరింది.
Also Read:
దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!
టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!
ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!