India Corona Cases: దేశంలో కొత్తగా 14,849 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా..

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే అనిపిస్తుంది. కొత్తగా 7,81,752 కరోనా టెస్టులు చేయగా.. 14,849 మందికి కోవిడ్-19 సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య..

India Corona Cases: దేశంలో కొత్తగా 14,849 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 11:15 AM

India Corona Cases: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే అనిపిస్తుంది. కొత్తగా 7,81,752 కరోనా టెస్టులు చేయగా.. 14,849 మందికి కోవిడ్-19 సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య  1,06,54,533కు చేరింది. తాజాగా మరో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,53,339కుచేరింది. కొత్తగా 15,948 మంది వైరస్​ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 1,03,16,786కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.83 శాతానికి పెరగగా.. డెత్ రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం  1,84,408 యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు దేశంలో జనవరి 16 న ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ది చేసిన కొవిషీల్డ్‌, భారత్ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి తీసుకొచ్చారు. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,91,609 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఫస్ట్ డోసు అందిన వారి సంఖ్య 15,82,201కు చేరింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే.

Also Read: తెలంగాణ కరోనా రౌండప్ : రాష్ట్రంలో కొత్తగా 197 పాజిటివ్ కేసులు.. రేపట్నుంచి ప్రవేట్ హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్