తెలంగాణ కరోనా రౌండప్ : రాష్ట్రంలో కొత్తగా 197 పాజిటివ్ కేసులు.. రేపట్నుంచి ప్రవేట్ హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. శనివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో కొత్తగా 197 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో

తెలంగాణ కరోనా రౌండప్ : రాష్ట్రంలో కొత్తగా 197 పాజిటివ్ కేసులు.. రేపట్నుంచి ప్రవేట్ హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్
Follow us

|

Updated on: Jan 24, 2021 | 10:49 AM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. శనివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో కొత్తగా 197 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ నమోదైన కేసుల సంఖ్య 2,93,253కి చేరింది. శనివారం వైరస్ కారణంగా ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం రిలీజ్ చేసిన బులిటెన్‌‌లో వెల్లడించింది. దీంతో మృతుల సంఖ్య 1,589కి చేరింది. కరోనాబారి నుంచి కొత్తగా 376 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,88,275కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,389 ఉండగా వీరిలో 1842 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 32 కేసులు వెలుగుచూశాయి.

మరోవైపు  తెలంగాణలో సోమవారం నుంచి ప్రవేట్ హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొత్తం 173 కేంద్రాలలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఒక లక్షా 50 వేల మంది ప్రవేట్ హెల్త్ వర్కర్లకు టీకా వేయనున్నారు.  ఇప్పటికే ఏర్పాట్లను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తుంది. ప్రవేట్ హెల్త్ వర్కర్స్ హైదరాబాద్‌‌లోనే అత్యధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

Also Read:

మరోసారి రక్తమోడిన ఔటర్ రింగ్ రోడ్, హిమాయత్ సాగర్ ఎగ్జిట్ దగ్గర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి

.