AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, చిలీ ఒప్పందం

శాంటియాగో : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్, చిలీలు ఇకపై సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం చిలీలో పర్యటిస్తున్నారు. గనులు, సంస్కృతి, దివ్యాంగుల సాధికారతకు సంబంధించిన మూడు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇండియా-చిలీ బిజినెస్ ఫోరంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆర్థిక భాగస్వామ్యం పెంపుదలకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. భారత్‌కు లాటిన్ […]

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, చిలీ ఒప్పందం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 8:07 PM

Share

శాంటియాగో : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్, చిలీలు ఇకపై సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం చిలీలో పర్యటిస్తున్నారు. గనులు, సంస్కృతి, దివ్యాంగుల సాధికారతకు సంబంధించిన మూడు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇండియా-చిలీ బిజినెస్ ఫోరంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆర్థిక భాగస్వామ్యం పెంపుదలకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. భారత్‌కు లాటిన్ అమెరికా ప్రాంతంలో చిలీ ఆరో పెద్ద భాగస్వామి అన్నారు. చిలీ యూనివర్సిటీకి చెందిన యువ శాస్త్రవేత్తలతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమావేశమయ్యారు.