AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని కావాలని కోరిక లేదు – కేసీఆర్

వరంగల్:  తనకు ప్రధాని మంత్రి పదవి పై ఆసక్తి లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ..’ప్రజల ఎజెండా గా పని చేస్తామన్నారు… కేంద్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉంటేనే రాష్ట్ర సమస్యలు తీరుతాయని ఆయన అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ పై మండిపడ్డారు కేసీఆర్… సర్పంచ్ స్థాయికి దిగజారి ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని.. 35 వేల కోట్లు ఇచ్చామని మోదీ అబద్దం చెప్పారని ఆగ్రహం […]

ప్రధాని కావాలని కోరిక లేదు - కేసీఆర్
Ravi Kiran
|

Updated on: Apr 02, 2019 | 8:07 PM

Share

వరంగల్:  తనకు ప్రధాని మంత్రి పదవి పై ఆసక్తి లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ..’ప్రజల ఎజెండా గా పని చేస్తామన్నారు… కేంద్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉంటేనే రాష్ట్ర సమస్యలు తీరుతాయని ఆయన అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ పై మండిపడ్డారు కేసీఆర్… సర్పంచ్ స్థాయికి దిగజారి ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని.. 35 వేల కోట్లు ఇచ్చామని మోదీ అబద్దం చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని.. దీనికి ప్రధాని క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు.

ప్రధాని ఎవరైనా ఫెడరల్ ఫ్రంట్ లోని పార్టీలకు చెందిన అన్ని ప్రాంతాలకు మేలు కలుగుతుందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ నిధుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెల్పించాల్సిందిగా ప్రజలను కోరారు. దేశం దశ.. దిశ మార్చాల్సిన సమయం వచ్చిందని.. దీని మీద మేధావులు కూడా ఆలోచించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.