మోదీ ఎగ్జిట్ ప్లాన్ ఇదే.. సెప్టెంబర్ దాకా..!

మోదీ ఎగ్జిట్ ప్లాన్ ఇదే.. సెప్టెంబర్ దాకా..!

కరోనా వైరస్ వ్యాప్తితో అతలాకుతలమైన ఇటలీని భారతదేశం ఆదర్శంగా తీసుకోబోతోందా? ఇటలీ రూపొందించిన ఎగ్జిట్ ఫార్ములానే మన దేశం కూడా అమలు పరచ పోతుందా? కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

Rajesh Sharma

|

May 01, 2020 | 7:35 PM

కరోనా వైరస్ వ్యాప్తితో అతలాకుతలమైన ఇటలీని భారతదేశం ఆదర్శంగా తీసుకోబోతోందా? ఇటలీ రూపొందించిన ఎగ్జిట్ ఫార్ములానే మన దేశం కూడా అమలు పరచ పోతుందా? కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపి, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఇటలీ దేశంలో సుదీర్ఘ కాలం పాటు లాక్‌డౌన్ అమలు పరిచి మెల్లిమెల్లిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. వివిధ దశల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తూ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఇటలీ. ప్రస్తుతం అదే విధానాన్ని మన దేశం కూడా పాటించనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

డేంజరస్ కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ఇటలీ దేశం మార్చి 10వ లాక్‌డౌన్‌ అమల్లోకి తెచ్చింది. యూరప్‌లోని మిగిలిన దేశాల కన్నా.. చాలా ముందుగా లాక్‌డౌన్ అమలు పరిచింది ఇటలీనే. తొలి రోజుల్లో వైరస్ తాకిడికి అతలాకుతలమైంది కూడా ఇటలీనే. ఇటలీలో తొలి కరోనా కేసు ఫిబ్రవరి ఇరయ్యవ తేదీన వెలుగులోకి రాగా, మార్చి 10వ తేదీ నాటికి తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాపించింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న మూడవ దేశంగా, కరోనా మరణాల్లో అమెరికా తర్వాత రెండో దేశంగా ఇటలీ వార్తల్లో ఎక్కడంతో ‘లాక్‌డౌన్‌’ను కఠినంగా అమలు పరచాల్సి వచ్చింది. అయితే లాక్‌డౌన్ ప్రకటించడంలో ఇటలీ ప్రధాని గిసెప్పీ కాంటే జాప్యం చేశారని అక్కడి విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఇటు మన దేశంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు జనవరి 30వ తేదీన వెలుగు చూసింది. మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇటలీతో పోలీస్తే మనదేశం‌లో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. మనదేశంలాగానే ఇటలీలో కూడా మే మూడవ తేదీన లాక్‌డౌన్ ముగియనున్నది. ఫస్ట్ ఫేజ్‌లో లాక్‌డౌన్‌తో జీవించడం, సెకెండ్ ఫేస్‌లో కరోనా వైరస్‌తో పాటు కలసి జాగ్రత్తలు తీసుకుంటూ కొనసాగడం.. అనే విధానాన్ని ఇటలీ అమలు చేసింది. ఈ వ్యూాహాన్ని ఇటలీ ప్రధాని స్వయంగా మార్చి తొమ్మిదవ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌ఋలో వివరించారు.

ఇక ప్రస్తుతానికి వస్తే.. మే 4వ తేదీ నుంచి ఇటలీలో లాక్ డౌన్ ఎత్తివేత ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఒకేసారి ఆంక్షలను ఎత్తివేయబోమని ఆ దేశం ఇదివరకే ప్రకటించింది. రోజువారి మినహాయింపులతో నెమ్మదిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని ఇటలీ ప్రకటించింది. మే నాలుగవ తేదీన ప్రజలు తమ ఏరియా పరిధులు దాటి సెల్ప్‌ డిక్లరేషన్‌తో ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళవచ్చు. ప్రజల వ్యాయామం కోసం పబ్లిక్ పార్కులను ఓపెన్ చేస్తారు. బార్లు, రెస్టారెంట్లను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలకు అనుమతిస్తారు. అంత్యక్రియలకు 15 మందికి మించి హాజరు కారాదు.

చాలా తక్కువ మందితో ప్రజా రవాణా‌ను అనుమతిస్తారు. మే 18వ తేదీ నుంచి రిటైల్‌ షాపింగ్, మ్యూజియంలు, లైబ్రరీలు, సాంస్కృతిక కేంద్రాలను ఓపెన్ చేస్తారు. జూన్‌ 1వ తేదీ నుంచి బార్లు, రెస్టారెంట్లు, హేర్‌ డ్రెసర్స్, వెల్‌నెస్‌ సెంటర్లు తెరిచే ఛాన్స్ ఇస్తారు. అయితే ప్రజలు అన్ని వేళల, అన్ని చోట్ల మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం షరతులు విధించనున్నది. సెప్టెంబర్‌ నెల నుంచి విద్యా సంస్థలను తెరవాలని, నైట్‌క్లబ్బులను, సినిమా హాళ్లను, మత కార్యక్రమాలను కూడా సెప్టెంబర్ తర్వాతనే అనుమతించాలని నిర్ణయించింది.

భారత్‌లో లాక్‌డౌన్‌ వల్ల జీడీపీ ఏడు శాతం పడిపోతుందని ఎకానమిస్టులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా ఇటలీ మాదిరిగానే లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేయవచ్చని వివిధ సామాజిక, రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌ లాక్‌డౌన్‌ మే మూడవ తేదీతో ఎండ్ కానున్న లాక్ డౌన్‌పై ప్రధాన మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? దీనికి మరికొన్ని గంటలే మిగిలిన నేపథ్యంలో ఆయన ఎప్పుడు దేశ ప్రజల ముందుకు వస్తారు అన్నదిపుడు టెన్షన్ రేకెత్తిస్తోంది.

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu