AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెప్పపాటులో ఘోరం..మితిమీరిన వేగం..డేంజర్ స్పాట్ అక్కడే..ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఇదే..!

భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం.. హెల్మెట్ లేకపోవడం.. వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు.

రెప్పపాటులో ఘోరం..మితిమీరిన వేగం..డేంజర్ స్పాట్ అక్కడే..ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఇదే..!
Sanjay Kasula
|

Updated on: Dec 14, 2020 | 5:41 PM

Share

రహదారిపై వరుస ప్రమాదాలు.. బ్లాక్‌ స్పాట్లు.. మలుపుల వద్ద దుర్ఘటనలు

ప్రమాదాలన్నీ..  హైదరాబాద్‌ చుట్టుపక్కలే..

ప్రాణాలు తీస్తున్న అతి వేగం, నిర్లక్ష్యం..

కరోనా మరణాల కంటే మూడింతలు ..

లాక్‌డౌన్‌లో పరిస్థితి మరింత దారుణం..

Increased Road Accidents : కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని అంటారు. జనన-మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో ఏ ప్రమాదాన్ని ముందుగా అంచనావేయలేమనేది  ఈ ప్రపంచంలో అత్యంత అలుపెరుగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు. కానీ మరణాలను అప్రమత్తతో  నిరోధించగలము. వీటికి ఈ మధ్య జరగుతున్న ప్రమాదాలు అన్ని నిర్లక్ష్యంతో జరిగినవే అని ప్రభుత్వ లేక్కలు  చెబుతున్నాయి. అన్ని ప్రమాదాలు రెప్పాటులో జరిగిపోతున్నాయి. ప్రతి ప్రమాదంలో డ్రైవర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది.

భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం.. హెల్మెట్ లేకపోవడం.. వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు.

అతి వేగం కారణంగా ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను రోడ్డు ప్రమాదాల వార్షిక నివేదికను ప్రతి ఏడాది ఆ శాఖ అధికారులు వెల్లడిస్తుంటారు.

అయితే ఈ ఏడాది ప్రమాదాలు కానీ.. ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో చట్టం చేయలేని పని కరోనా పర్యవసానంగా విధించిన లాక్‌ డౌన్‌ చేసిందని సుప్రీంకోర్టుకు ఈ ఏడాది ప్రారంభంలో వ్యాఖ్యానించింది. చట్టాలు చేయడం.. చట్టాల్లో సవరణలు చేయడం వల్లే వాహనదారుల్లో మార్పు రావడం లేదని తేలిపోయింది. అయితే లాక్‌డౌన్‌ వల్ల మాత్రం రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున తగ్గిపోయాయి.

ఇదిలావుంటే..2019 లో దేశ వ్యాపత్ంగా 4,49,002 ప్రమాదాలు జరిగాయి. వీరిలో 1,51,113 మంది మృతి చెందగా, 4,51,361 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఏడాది భారతదేశంలో ప్రతి రోజూ 1,230 రోడ్డు ప్రమాదాలు మరియు 414 మరణాలు సంభవించాయి. ప్రతి గంటకు 51 రోడ్డు ప్రమాదాలు మరియు 17 మరణాలు సంభవించాయి.

ఇక గత ఏడాది భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు మరియు మరణాలకు ప్రధాన కారణం అతి వేగంతో డ్రైవింగ్ చేయడం అని అధికారుల లేక్కలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలలో 1,01,699 ప్రాణాంతక ప్రమాదాలు జరిగాయి. 2019 లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాలలో 71% ప్రమాదాలు వాహనాల వేగంతో సంభవించాయి. ప్రమాదాలలో 72.4% మంది గాయపడ్డారు. అయితే ఈ ఏడాది కరోనా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది.

లాక్‌డౌన్ తర్వాత…

కరోనా లాక్‌డౌన్ తర్వాత జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే వాటి సంఖ్య భారీగా పెగింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది.

10.11.2020 ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు వలస కూలీలు మృతి చెందారు. జార్ఖండ్‌లోని రామ్‌ఘాడ్ ప్రాంతానికి చెందిన పదిమంది కార్పెంటర్లు ఓ వాహనాన్ని మాట్లాడుకుని సొంత రాష్ట్రానికి బయల్దేరారు. వాహనం పాటి గ్రామానికి చేరేసరికి వెనక నుండి అతి వేగంగా వచ్చిన మరో వాహనం జైలో వాహనాన్ని ఢీకొట్టింది. వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో చాలా దూరం వరకు వెళ్ళి పడిపోయింది. ఈ ప్రమాదంలో జైలో వాహనం నుజ్జు నుజ్జయింది. ఇందులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

వేగాన్ని అంచనా వేయలేక..

02.12.2020 : బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల మండలం కందాడ-మల్కాపూర్‌ రోడ్డు మలుపు వద్ద అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 11 మందిలో ఏడుగురు దుర్మరణం చెందారు.

ఆపిన వాహనం ఆయువు తీస్తోంది..

10.12.2020 కృష్ణా జిల్లా గరికపాడు వద్ద వేగంగా వెళుతున్న కారు, లారీని ఢీ కొట్టింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్నవారు అక్కడిక్కడే మృతి చెందారు. కేవలం ఆ పది రోజుల్లో ఈ తరహా ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మూడేళ్లలో ఇలా ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్డం వల్ల 1,827 ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 563 మంది చనిపోయారు.

రెప్పపాటులో ఘోరం..

12.12.2020 : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు, కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా బాలిక వంతెన పైనుంచి నందిలో పడి గల్లంతైంది. ఈ అత్యంత విషాద ఘటన నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి కాజ్‌వే వంతెన వద్ద జరిగింది. విశాఖపట్నంకి చెందిన యువకులు త్రినాథ్, సాయి మేనకూరు సెజ్‌లోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నారు. వారితో కలసి పనిచేస్తున్న మోదుగులపాళెం గ్రామానికి చెందిన నాగూర్‌తో కలసి భోజనం చేసేందుకు నాయుడుపేట బయలుదేరారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.