Bigg Boss 4: హారిక అర్హురాలు కాదు.. కుండబద్దలుకొట్టిన అభిజిత్.. పాజిటివ్‌గా తీసుకున్న అరియానా..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇంట్లో 5గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. కాగా చివరి రోజులలో హౌస్మేట్స్ ఉండే తీరు, వారి ప్రవర్తనపై
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇంట్లో 5గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. కాగా చివరి రోజులలో హౌస్మేట్స్ ఉండే తీరు, వారి ప్రవర్తనపై ప్రేక్షకులు వేసే ఓటింగ్ విధానం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న సభ్యులు హారిక, అభిజిత్, అరియానా, సోహైల్, అఖిల్ బిగ్‌బాస్ చివరి వారం కావడంతో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. బిగ్‌బాస్ విన్నర్‌ను ఎంపిక చేయడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో అటు ఇంట్లో వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టడానికి వ్యూహాలు రచిస్తూనే ఉన్నాడు. కాగా తాజాగా వదిలిన ప్రోమో ప్రకారం ఈరోజు ఎపిసోడ్లో హౌస్మేట్స్ మధ్య మళ్ళీ గొడవలు జరిగినట్టుగానే కనిపిస్తున్నాయి.
కానీ ఈసారి మాత్రం అభి, హారిక మధ్య చిచ్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. హౌస్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్లలో ఎవరు విన్నర్ కావడానికి అర్హత లేదో వాళ్ళ పేరు చెప్పమని.. దానికి సరైన వివరణ ఇవ్వాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో హారిక అర్హురాలు కావొద్దు అంటూ బాంబ్ పేల్చాడు. ఇక మిగిలిన ఇంటి సభ్యులు హారిక, సోహైల్, అఖిల్ ముగ్గురు కూడా అరియానా విన్నర్ కావడానికి అర్హులు కాదు అని చెప్పారు. దీంతో “అందరి మైండ్‌లో తను ఉన్నానంటే తాను గేమ్ ఎలా ఆడుతున్నానో అర్థమైందని.. తను గేమర్ అని.. ఇది నాకు చాలా సంతోషంగా ఉందని అరియానా తనపై వచ్చిన కామెంట్లను కూడా పాజిటివ్‌గానే తీసుకుంది. ఇక ఇందులో మొత్తానికి ఎవరిని అనర్హురాలుగా ప్రకటించారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.