Bigg Boss 4 : మరింత సందడిగా బిగ్ బాస్4 చివరి వారం.. డ్యాన్స్‌‌‌లతో హోరెత్తించిన ఇంటిసభ్యులు

బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి  చేరుకుంది. ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 4 ముగుస్తుంది. హౌస్ లో చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు.

Bigg Boss 4 : మరింత సందడిగా బిగ్ బాస్4 చివరి వారం.. డ్యాన్స్‌‌‌లతో హోరెత్తించిన ఇంటిసభ్యులు
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2020 | 6:12 PM

బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి  చేరుకుంది. ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 4 ముగుస్తుంది. హౌస్ లో చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. అఖిల్, అభిజీత్, సోహెల్, హారిక, అరియనా టాప్ 5 లో ఉన్నారు. ఈ ఐదుగురిలో ఒకరు విజేత కానున్నారు. హౌస్‌లో  మిగిలిన కంటెస్టెంట్స్ లో ఎవరు విజేతగా నిలవనున్నారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా  ప్రోమోను విడుదల చేసారు.  బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన ఐదుగురు సభ్యులు చేసిన సందడిని పాటగా మార్చి హౌస్ప్‌లో ప్లే చేసారు.

ఈ పాటకు ఇంట్లో ఉన్నవారంతా హుషారుగా  డ్యాన్స్ లు వేశారు. అభిజీత్ ను తెలుగులో మాట్లాడమన్న డైలాగ్ ను, అరియనా దెయ్యం చూసి భయపడిన సందర్భాన్ని, ఇక హారిక ‘దేత్తడి దేత్తడి’ అంటూ పాడిన పాటనూ అన్నింటిని కలిపి ఒక సాంగ్ గా మార్చి ప్లే చేసాడు బిగ్ బాస్ . ఇక ఈ ప్రోమో చూస్తుంటే లాస్ట్ వీక్ మరింత సందడిగా ఉండనుందని అర్ధమవుతుంది. అంతకు ముందు విడుదల చేసిన ప్రోమోలో హౌస్ లో ఎవరు విన్నర్ అవ్వడానికి అర్హులుకారు అని మీరు అనుకుంటున్నారు అని ఇరికించే ప్రశ్న అడిగాడు బిగ్ బాస్.  అనూహ్యంగా హారిక పేరు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు అభిజీత్.

ఇన్నిరోజులు క్లోజ్ గా కలిసి  ఉన్న హారికను బిగ్ బాస్ విన్ అవ్వడానికి అర్హురాలు కాదు అని అభి చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అరియనా అర్హురాలు కాదు అని అఖిల్ , సోహెల్ , హారిక చెప్పారు. అరియనా మాత్రం తాను ఇక్కడివరకు వచ్చానంటే నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ చెప్పుకొచ్చింది. చూడాలి మరి ఈ వారం ఎం జరుగుతుందో.. ఇక హౌస్ లో మిగిలిన ఇంటిసభ్యుల్లో ఎవరు విజేత అవుతారని ప్రేక్షకులంతా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.