ఆ రెండు జిల్లాల్లో పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఇందులో ముందు వరసులో ఉమ్మడి నల్గొండ, కామారెడ్డి జిల్లాలో నిలుస్తున్నాయి. కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అయినా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా...
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఇందులో ముందు వరసులో ఉమ్మడి నల్గొండ, కామారెడ్డి జిల్లాలో నిలుస్తున్నాయి. కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అయినా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా ఉధృతి అధికంగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,781కి ఉంది. అలాగే ఇప్పటి వరకు కరోనా బారిన పడి 22 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి కోలుకుని 286మంది డిశ్చార్జ్ అవగా… ప్రస్తుతం 1473 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2741 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య సుమారుగా 50కి చేరుకుంది. యాక్టివ్ కేసులు 2416 ఉండగా… నల్గొండ జిల్లాలో 1434 పాజిటివ్ కేసులు.. సూర్యాపేట జిల్లాలో 887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 420 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం ఈనెల 14 నుంచి లాక్‌డౌన్ నిబంధనలో సడలింపు చేయనున్నారు. ఈనెల 14 నుంచి 21 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వహణకు అనుమతించారు.