Spider Monkey: ఆ కొండముచ్చు కోసం ఊరు ఊరంతా ఏడ్చేసింది.. కారణం తెలిస్తే మీరూ అయ్యో అంటారు..

Spider Monkey: ఆ ఊళ్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఊరందరికి ప్రీతిపాత్రమైన ఓ జీవి ప్రాణాలు విడువగా.. అందరి కళ్లు..

Spider Monkey: ఆ కొండముచ్చు కోసం ఊరు ఊరంతా ఏడ్చేసింది.. కారణం తెలిస్తే మీరూ అయ్యో అంటారు..
Spider Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 13, 2021 | 9:27 PM

Spider Monkey: ఆ ఊళ్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఊరందరికి ప్రీతిపాత్రమైన ఓ జీవి ప్రాణాలు విడువగా.. అందరి కళ్లు చమర్చాయి. ఇన్ని రోజులు చెంగుచెంగునా ఎగురుకుంటూ… అందరికీ ప్రశాంత వాతావరణం కలిగించిన అందరి స్నేహితుడు దూరమయ్యాడు. ఇదంతా ఏదో మనిషి గురించి కాదు.. ఊరికి కోతుల బెడద తప్పించిన కొండముచ్చు గురించి. అవును.. కోతులు పెట్టే నరకయాతన నుంచి తమను రక్షించిన కొండముచ్చు చనిపోవడంతో ఆ ఊరు ప్రజలంతా కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాదు.. ఆ కొండముచ్చుకు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.

పూర్తి వివరాల్లోకెళితే.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామపరిధిలోని రంగన్నపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉండేది. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కొండముచ్చు వచ్చింది. ఆ కోతుల బెడద నుంచి గ్రామస్తులను రక్షించింది. దానికి కృతజ్ఞతగా వారు దానికి ఆహార పదార్థాలు పెట్టేవారు. గ్రామస్తులు పెట్టే ఆహారం తింటూ ఆ కొండముచ్చు కాలం వెల్లదీసింది. అయితే, ఇటీవల అనారోగ్యానికి గురైన కొండముచ్చు.. రంగన్నపల్లి గ్రామ శివారులో మృతి చెందింది. అది గమనించిన గ్రామస్తులు అయ్యో పాపం అనుకున్నారు. తమను కోతుల బెదడ నుంచి కాపాడిన కొండముచ్చును తలుచుకుని వారు కన్నీరు కార్చారు. కాగా, గ్రామ ప్రజలు చనిపోయిన కొండముచ్చుకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మనుషులకు నిర్వహించినట్లే సంప్రదాయ బద్దంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి ఈ కొండముచ్చుకు ఇలా సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఓ‌మూగ జీవికి అంత్యక్రియలు నిర్వహించి గ్రామస్తులు… అందరికి‌ ఆదర్శంగా నిలిచారు.

Monkey

Monkey

Also read:

AP Municipal Elections 2021: పటిష్టమైన భద్రతతో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. మార్గదర్శకాలు జారీ చేసిన ఎస్‌ఈసీ

Boxer Vijender Singh: మార్చి 19న బాక్సింగ్.. రష్యా బాక్సర్ ఆర్టిన్‌తో తలపడనున్న విజేందర్ సింగ్.. మరోసారి తన పంచ్ పవర్ చూపేనా..!

IND Vs ENG : మొదటి మ్యాచ్‌ దెబ్బకి.. భారత క్రికెట్‌ జట్టులో భారీ మార్పులు..! తుది జట్టులో రోహిత్‌ శర్మకి స్థానం..?

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!