Boxer Vijender Singh: మార్చి 19న బాక్సింగ్.. రష్యా బాక్సర్ ఆర్టిన్‌తో తలపడనున్న విజేందర్ సింగ్.. మరోసారి తన పంచ్ పవర్ చూపేనా..!

Boxer Vijender Singh: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన గేమ్స్ ఒక్కొక్కటిగా మొదలువుతున్నాయి. కరోనా వ్యాక్సిన్..

Boxer Vijender Singh: మార్చి 19న బాక్సింగ్.. రష్యా బాక్సర్ ఆర్టిన్‌తో తలపడనున్న విజేందర్ సింగ్.. మరోసారి తన పంచ్ పవర్ చూపేనా..!
Vijender Singh
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 13, 2021 | 9:05 PM

Boxer Vijender Singh: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన గేమ్స్ ఒక్కొక్కటిగా మొదలువుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో నిర్వాహకులు గేమ్స్‌ను మళ్లీ షురూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అంతర్జాతీయ బాక్సింగ్‌ పోరుకు సిద్ధమవుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదికిపైగా రింగ్‌కు దూరంగా ఉన్న విజేందర్.. ఎప్పుడెప్పుడు పోటీలు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు నిర్వాహకులు. ఈనెల 19న గోవా వేదికగా అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలు జరుగనున్నాయి. గోవాలోని సముద్ర తీరంలో మెజిస్టిక్ క్యాసినో షిప్ రూఫ్‌పై సూపర్ మిడిల్ వెయిట్(76 కేజీలు) విభాగంలో రష్యాకు చెందిన అర్టిశ్ లోప్సన్‌తో విజేందర్ తలపడనున్నాడు. ఈ పోటీల కోసం విజేందర్ సింగ్ దాదాపు రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నాడు. ఈ బ్యాక్సింగ్ పోటీలకు సమయం కూడా పెద్దగా లేకపోవడంతో అందరి దృష్టి ఇప్పుడు గోవా ఈవెంట్‌పైనే పడింది.

ఇక ఈ పోటీలపై స్పందించిన విజేందర్ సింగ్.. ‘ఈ ఏడాది చాలా కఠినంగా గడిచిపోయింది. గ్యాప్ ఎక్కువగా రావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. ఈ పోటీల కోసం రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నాను. బ్రిటీష్ ట్రైనర్ లీ బియర్డ్‌తో పాటు, జైభగవాన్ సారథ్యంలో శిక్షణ తీసుకున్నాను. గోవాలో జరిగే పోటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. మరోవైపు విజేందర్ ప్రత్యర్థి అర్టిశ్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. విజేందర్ గొప్ప విజేత కానీ, అతనికి ఓటమి రుచి చూపించేందుకే ఇక్కడి వచ్చానంటూ అర్టిశ్ చెబుతున్నాడు. మరి గెలుపెవరిది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

కాగా, ఇప్పటి వరకు 12 ప్రో బాక్సింగ్ బౌట్లలో పాల్గొన్న విజేందర్ సింగ్.. అన్ని పోటీల్లోనూ విజయం సాధించి తనకు మరెవరూ సాటి లేరని నిరూపించుకున్నాడు. ఇక విజేందర్ సింగ్ చివరగా 2019, నవంబర్‌లో ఘనాకు చెందిన చార్లెస్ అడముతో తలపడి అతన్ని చిత్తుగా ఓడించాడు. ఆ తరువాత కరోనా వ్యాప్తి చెందడంతో బాక్సింగ్‌కు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఇప్పుడు మళ్లీ పోటీలు ప్రారంభం కానుండటంతో విజేందర్ తన పంచ్‌లకు పదును పెడుతున్నాడు.

Also read:

Gautam Adani : సంపదలో రికార్డులు బ్రేక్ చేస్తున్న గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరులకు షాక్‌ల మీద షాక్‌లు..

Piyush Goyal: కరోనా విపత్కర సమయంలో భారత్‌ 150 దేశాలకు సాయం చేసింది : కేంద్ర రైల్వే శాఖ మంత్రి