హర్యానాలో అన్నదాతలపై పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగం, సీఎం ఖట్టర్ రాకను అడ్డునేందుకు రైతుల యత్నం
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జిల్లాలోని కైమ్లా గ్రామంలో మహా కిసాన్ పంచాయత్ కార్యక్రమంలో
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జిల్లాలోని కైమ్లా గ్రామంలో మహా కిసాన్ పంచాయత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వస్తున్నారని తెలుసుకున్న వందలాది రైతులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసు బ్యారికేడ్లను విరగగొట్టుకుని ముందుకు దూసుకురావడానికి యత్నించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్లను, బాష్ప వాయువును ప్రయోగించారు. సీఎం రానున్న స్థలానికి చేరుకున్న కొంతమంది అన్నదాతలు హెలిపాడ్ ను నాశనం చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్న పలు గ్రామాలవారు తమ గ్రామాలలోకి … చట్టాలను సమర్థిస్తున్న నేతలు, పార్టీలవారిని రానివ్వబోమని ఇప్పటికే హెచ్ఛరించారు.