Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన… ఎన్నికలే లక్ష్యంగా హామీ… ఏం ప్రకటించారంటే…
బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు, నాలుగు నెలలు సమయమే ఉండడంతో అధికార తృణమూల్...
బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు, నాలుగు నెలలు సమయమే ఉండడంతో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఇప్పటి నుంచే ప్రజలపై హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ కీలక హామీనిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మమత ఇలాంటి ప్రకటన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సేమ్ టూ సేమ్…
అయితే 2020 ఏడాది చివరలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇలాంటి హామీనే ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. వారికి ఈ ప్రకటన భారీగానే ఓట్లను రాబట్టింది. అంతేకాకుండా ఉచిత వ్యాక్సిన్ ప్రకటనను పరిశీలించిన సీఈసీ దానిలో ఎలాంటి తప్పదంలేదని తెలిపింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు రాదని స్పష్టం చేసింది.
బిహార్ ఎన్నికల అనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే హామీని ప్రధానంగా ప్రచారం చేసింది. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏవిధంగా ఓట్లు దండుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ బాటనే ఎంచుకున్న మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంగా ఉచిత వ్యాక్సిన్ పంపిణీ హామీపై ముందుగానే ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని సాక్ష్యాత్తూ సీఎం మమత ప్రకటించారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, మున్సిపల్ కార్మికులు, పోలీసు సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు.