Vakeel Saab Teaser: ‘వకీల్ సాబ్’కు లీకుల బెడద.. టీజర్ ముందే వస్తుందా..? వెయిటింగ్ అంటోన్న ఫ్యాన్స్ !
స్టార్ హీరోల సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అందుకే అలాంటి సినిమాకు లీకుల దెబ్బగట్టిగా పడుతుంది.

Vakeel Saab Teaser: స్టార్ హీరోల సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అందుకే అలాంటి సినిమాకు లీకుల దెబ్బగట్టిగా పడుతుంది. ప్రజెంట్ వకీల్ సాబ్ పరిస్థితి కూడా అదే. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా షూటింగ్ పిక్స్ లీక్ అవుతూనే ఉన్నాయి.
ఇప్పటికే పవన్ లుక్‌తో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని స్టిల్స్ అఫీషియల్ రిలీజ్‌కన్నా ముందే లీకైపోయాయి. తాజాగా టీజర్ విషయంలోనూ అదే జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. వకీల్ సాబ్ టీజర్‌ను జనవరి 14న సాయంత్రం రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ ఈ లోగా టీజర్ లీకైందన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.
ఈ మధ్య కేజీఎఫ్ 2 విషయంలోనూ అదే జరిగింది. 8న టీజర్ రిలీజ్ చేద్దామనుకుంటే ముందే లీకైపోయింది. దీంతో చేసేదేమి లేక చెప్పిన టైం కన్నా 14 గంటలు ముందుగానే టీజర్‌ను వదిలేశారు మేకర్స్. అంతే కాదు.. మీరు లీక్ అయితే చేయగలిగారు కానీ, యష్ పుట్టినరోజు ప్రభంజనాన్ని ఆపలేకపోయారు అంటూ మేకర్స్ చేసిన ట్వీట్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. మరి ఇప్పుడు వకీల్ సాబ్ యూనిట్ కూడా చెప్పిన టైమ్‌కన్నా ముందే టీజర్‌ని అందించేస్తారా? లేకుంటే లీకైన టీజర్‌కు బదులు మరో కొత్త టీజర్‌ను కట్ చేస్తారా..? చూడాలి మరి.
Also Read:
Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి




