ఇండియా శరణు కోరిన ఇమ్రాన్ మాజీ సహచరుడు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ సహచరుడు, ఒకప్పుడు ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎమ్మెల్యే కూడా అయిన బలదేవ్ కుమార్ తన కుటుంబంతో సహా భారత్ చేరుకున్నాడు. ఇక్కడ ఆయన తనకు ‘ రాజకీయ శరణు ‘ కల్పించాలని కోరుతున్నాడు. పాక్ లోని బారికోట్ నుంచి గతంలో ఈయన ఈ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే తమ దేశంలో హిందువులు, సిక్కులతో సహా మైనారిటీలను వేధిస్తున్నారని 43 ఏళ్ళ బలదేవ్ ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పాలనలో […]
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ సహచరుడు, ఒకప్పుడు ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎమ్మెల్యే కూడా అయిన బలదేవ్ కుమార్ తన కుటుంబంతో సహా భారత్ చేరుకున్నాడు. ఇక్కడ ఆయన తనకు ‘ రాజకీయ శరణు ‘ కల్పించాలని కోరుతున్నాడు. పాక్ లోని బారికోట్ నుంచి గతంలో ఈయన ఈ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే తమ దేశంలో హిందువులు, సిక్కులతో సహా మైనారిటీలను వేధిస్తున్నారని 43 ఏళ్ళ బలదేవ్ ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పాలనలో వారిని అదేపనిగా ప్రాసిక్యూట్ చేయడం ఎక్కువైందని ఆయన తెలిపాడు. 2016 లో తన నియోజకవర్గంలో సొరన్ సింగ్ అనే ఎమ్మెల్యే హత్యకు గురయ్యాడని, అయితే తనపై తప్పుడు మర్డర్ కేసు పెట్టారని ఆయన పేర్కొన్నాడు. 2018 లో తనను కోర్టు నిర్దోషిగా విడిచిపుచ్చిందని తెలిపిన ఆయన.. ఇటీవలి కాలంలో పాక్ లో హిందూ, సిక్కు, క్రిస్టియన్ అమ్మాయిలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారుస్తున్నారని, ముస్లిం యువకులతో వారి పెళ్లి జరిపిస్తున్నారని చెప్పాడు. తన కుటుంబంతో బాటు బలదేవ్ ప్రస్తుతం లూథియానా సమీపంలోని ఖన్నా అనే ప్రాంతంలో ఉన్నాడు. నా కుటుంబాన్ని దేశం విడిచి వెళ్లిపోవాలని కొంతమంది దుండగులు బెదిరించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ, ఐ ఎస్ ఐ ఆదేశాల మేరకు నడచుకుంటున్నారు అని బలదేవ్ ఆరోపించాడు. 2007 లో ఈయన కౌన్సిలర్ గా ఉండగా.. లుధియానాకు చెందిన భావన అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.