అతి ప్రమాదకరమైన చోట దిగిన విక్రమ్ ల్యాండర్.?

చంద్రుడి దక్షిణ ధృవంపై అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయని యూరోపియన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయడం చాలా ప్రమాదకరమని చెప్పింది. అక్కడ ఎప్పటికప్పుడు మారే వాతావరణానికి తోడు రేడియేషన్, ధూళి కణాలు కలిసి రోవర్ల సోలార్ ప్యానెళ్లను కప్పేస్తాయంది. ఇలాంటి ప్రమాదకర ప్రాంతంలోనే చంద్రయాన్ 2 కూడా దిగిందని తెలిపింది. దక్షిణ ధృవంలో ఉండే ధూళి కణాలు విక్రమ్ ల్యాండర్‌కు సంకేతలోపం వచ్చిందంది. ఆ ప్రాంతం ల్యాండింగ్ కు సరైందని కాదని తెలిపింది. […]

  • Ravi Kiran
  • Publish Date - 1:42 pm, Tue, 10 September 19
అతి ప్రమాదకరమైన చోట దిగిన విక్రమ్ ల్యాండర్.?

చంద్రుడి దక్షిణ ధృవంపై అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయని యూరోపియన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయడం చాలా ప్రమాదకరమని చెప్పింది. అక్కడ ఎప్పటికప్పుడు మారే వాతావరణానికి తోడు రేడియేషన్, ధూళి కణాలు కలిసి రోవర్ల సోలార్ ప్యానెళ్లను కప్పేస్తాయంది. ఇలాంటి ప్రమాదకర ప్రాంతంలోనే చంద్రయాన్ 2 కూడా దిగిందని తెలిపింది. దక్షిణ ధృవంలో ఉండే ధూళి కణాలు విక్రమ్ ల్యాండర్‌కు సంకేతలోపం వచ్చిందంది. ఆ ప్రాంతం ల్యాండింగ్ కు సరైందని కాదని తెలిపింది. అంతేకాకుండా 2018లో చంద్రయాన్ 2 లాంటి మానవ రహిత మిషన్ ఒకదానిని చంద్రుడి దక్షిణ ధృవానికి పంపే ఏర్పాటు చేశామని.. కానీ నిధుల్లేక ఆ ప్రయోగం ఆగిపోయిందని తెలిపింది.

మరోవైపు చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్లు ఇస్రో ఇవాళ వెల్లడించింది. తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా పోస్ట్ చేసింది. చంద్ర‌యాన్‌2కు చెందిన ఆర్బిటార్‌.. విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించిన‌ట్లు ఇస్రో పేర్కొన్న‌ది. కానీ విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో ఎటువంటి క‌మ్యూనికేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని ఇస్రో చెప్పింది. దానితో క‌మ్యూనికేష‌న్ ఏర్ప‌రిచేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది.