ఐఎస్‌సీ, ఐసీఎస్‌ఈ ఫలితాలు విడుదల

ఐఎస్‌సీ 12వ తరగతి, ఐసీఎస్‌ఈ 10వ తరగతి రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఐఎస్‌సీలో 96.21 శాతం, ఐసీఎస్‌ఈలో 98.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి ఫలితాల్లో కోల్‌కతాకు చెందిన దేవాంగ్ కుమార్ అగర్వాల్, బెంగళూరుకు చెందిన విభ స్వామినాథన్ 100 శాతం మార్కులు సాధించారు. 99.5 శాతం మార్కులు ఏడుగురు సాధించగా, 99.25 శాతం మార్కులు 17 మంది, 99 శాతం మార్కులు 25 మంది విద్యార్థులు సాధించారు. 10వ తరగతి ఫలితాల్లో ముంబైకి చెందిన జూహీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:37 pm, Tue, 7 May 19
ఐఎస్‌సీ, ఐసీఎస్‌ఈ ఫలితాలు విడుదల

ఐఎస్‌సీ 12వ తరగతి, ఐసీఎస్‌ఈ 10వ తరగతి రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఐఎస్‌సీలో 96.21 శాతం, ఐసీఎస్‌ఈలో 98.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి ఫలితాల్లో కోల్‌కతాకు చెందిన దేవాంగ్ కుమార్ అగర్వాల్, బెంగళూరుకు చెందిన విభ స్వామినాథన్ 100 శాతం మార్కులు సాధించారు. 99.5 శాతం మార్కులు ఏడుగురు సాధించగా, 99.25 శాతం మార్కులు 17 మంది, 99 శాతం మార్కులు 25 మంది విద్యార్థులు సాధించారు. 10వ తరగతి ఫలితాల్లో ముంబైకి చెందిన జూహీ రూపేశ్ కజరాయ్ 99.60 శాతం మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఫలితాలు, ఇతర సమాచారాన్ని www.cisce.org వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.