లైవ్ లో నామినేషన్ స్వీకరిస్తా, డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవికి రెండో సారి పోటీ చేస్తున్న అధ్యక్షుడు ట్రంప్.. తాను వచ్ఛేవారం వైట్ హౌస్ లో ప్రసంగిస్తున్న సందర్భంగా తన రిపబ్లికన్ నామినేషన్ ని లైవ్ లో..

  • Umakanth Rao
  • Publish Date - 4:06 pm, Tue, 18 August 20
లైవ్ లో నామినేషన్ స్వీకరిస్తా, డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవికి రెండో సారి పోటీ చేస్తున్న అధ్యక్షుడు ట్రంప్.. తాను వచ్ఛేవారం వైట్ హౌస్ లో ప్రసంగిస్తున్న సందర్భంగా తన రిపబ్లికన్ నామినేషన్ ని లైవ్ లో స్వీకరిస్తానని ప్రకటించారు. మా శ్వేత సౌధం పచ్చిక (లాన్) లో నిలబడి ఈ నామినేషన్ అందుకుంటా.. ఆ చోటు అంటే నాకెంతో ఇష్టం’ అన్నారు. అది మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. విస్కాన్సిన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..డెమొక్రాట్లు కొన్ని ప్రసంగాలను ముందే రికార్డు చేసి పెట్టుకుంటున్నారని విమర్శించారు. కానీ వచ్ఛే గురువారం తాను లైవ్ గా ‘రియల్ స్పీచ్’ ఇస్తానని, వైట్ హౌస్ నుంచి మీరు ప్రత్యక్షంగా దాన్ని వింటారని ఆయన పేర్కొన్నారు. విస్కాన్సిన్ లో జరిగిన ప్రచారంలో డెమొక్రాట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

కాగా తమ అధ్యక్షులవారి ‘లైవ్ లవ్’ మీద సాక్షాత్తూ ఆయన రిపబ్లికన్ పార్టీలోని సభ్యులే విమర్శిస్తున్నారు. ఇక డెమొక్రాట్లు సరేసరి ! దీన్నొక హాస్యాస్పదమైనదిగా వారు కొట్టి పారేశారు.