AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడఖ్ గగన విహారంలో తేజస్ యుద్ధ విమానం

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం అప్రమత్తమైంది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

లడఖ్ గగన విహారంలో తేజస్ యుద్ధ విమానం
Balaraju Goud
|

Updated on: Aug 18, 2020 | 4:08 PM

Share

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం అప్రమత్తమైంది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా తేజస్ స్క్వాడ్రన్‌ను ఇక్కడి నుంచి పశ్చిమ సరిహద్దు వైమానిక స్థావరానికి తరలించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించిన ప్రధాని మోదీ స్వదేశంలో తయారైన తేజస్ యుద్ధ విమానం సత్తాను ప్రశంసించారు. ఎల్ఏసీ మార్క్1ఏ వర్షన్ యుద్ధ విమానాలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.

ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాల 45 స్క్వాడ్రన్ దక్షిణ ఎయిర్ కమాండ్ పరిధిలోని కోయంబత్తూరు సమీపంలోని సులూరు వైమానిక స్థావరంలో కొనసాగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తేజస్ విమానాలు సరిహద్దుకు తరలివెళ్లాయి. మరోవైపు, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలపై భారత వాయుసేన గట్టి నిఘా పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించింది. సరిహద్దు ప్రాంతాల్లో పగలు, రాత్రిపూట విన్యాసాలు చేస్తూ పహారా కాస్తున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..