జూన్ 5 నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు…?

లాక్‌డౌన్‌ 4.0లో కొన్ని సడలింపులు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇచ్చింది. అయితే హైదరాబాద్‌ నగరంలోనూ సిటీ సర్వీసులను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే రేపటితో (మే 31) నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగుస్తుండటంతో కేం ద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు తమ కార్యకలాపాలను మొదలైట్టిన నేపథ్యంలో.. సిటీ బస్సులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. […]

జూన్ 5 నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు...?
Follow us

|

Updated on: May 30, 2020 | 10:56 AM

లాక్‌డౌన్‌ 4.0లో కొన్ని సడలింపులు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇచ్చింది. అయితే హైదరాబాద్‌ నగరంలోనూ సిటీ సర్వీసులను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే రేపటితో (మే 31) నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగుస్తుండటంతో కేం ద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు తమ కార్యకలాపాలను మొదలైట్టిన నేపథ్యంలో.. సిటీ బస్సులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా సర్వీసులు ప్రారంభించిట్లే.. అవే నిబంధనలతో సిటీ సర్వీసులు కూడా ప్రారంభించాలని హైదరాబాద్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జూన్ మొదటి వారంలో సిటీ బస్సులు నడిపేందుకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. సిటీ బస్సులతోపాటు మెట్రో ట్రైన్‌ సర్వీసులు కూడా అనుమతి ఇచ్చే అకాశం ఉంది.