కారు బోల్తా… తప్పిన ప్రమాదం

లాక్‌డౌన్‌ సడలించటంతో రేసర్లు రోడ్డెకుతున్నారు. థ్రిల్ కోసం ఎంతకైనా సై అంటున్నారు యూత్. థ్రిల్ కోసం గేమ్స్ ఆడుతూ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదం అలాంటిదే అని పోలీసులు అనుమానిస్తున్నారు. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో ఓ కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. టోలిచౌకి బ్రిడ్జి సమీపంలో వేగంగా దూసుకువచ్చిన కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి ఫల్టీ కొట్టింది. ఘటన జరిగిన వెంటనే […]

కారు బోల్తా... తప్పిన ప్రమాదం
Follow us

|

Updated on: May 30, 2020 | 10:25 AM

లాక్‌డౌన్‌ సడలించటంతో రేసర్లు రోడ్డెకుతున్నారు. థ్రిల్ కోసం ఎంతకైనా సై అంటున్నారు యూత్. థ్రిల్ కోసం గేమ్స్ ఆడుతూ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదం అలాంటిదే అని పోలీసులు అనుమానిస్తున్నారు. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో ఓ కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. టోలిచౌకి బ్రిడ్జి సమీపంలో వేగంగా దూసుకువచ్చిన కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి ఫల్టీ కొట్టింది. ఘటన జరిగిన వెంటనే యువకులు కారు వదిలిపారిపోయారు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.